(సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)
నాయకులు మొక్కలు నాటి వాటిని పరి రక్షించాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. కానీ ఇక్కడ హరితహారంలో ఎమ్మెల్యే నాటిన మొక్కను తిన్నదనే నెపంతో రెండురోజులుగా ఇనుప కడ్డీల మధ్య మేక పిల్ల ను బంధించారు. సంఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మునిసిపాలిటీ పరిధిలో వెలుగు చూసింది. కొల్లాపూర్ పట్టణవాసి టైలర్ రంగకు చెందిన నాలుగు నెలల మేక పిల్లను స్థానిక 7వ వార్డులో హరితహారంలో భాగంగా నాయకులు నాటిన మొక్కను తిన్నదని మునిసిపల్ సిబ్బంది నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనం ఆవరణలో ఇనుప కడ్డీల మధ్య బంధించారు. విషయం తెలుసుకున్న మేక యజమాని మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని తన మేకను వదిలిపెట్టాలని మునిసిపల్ సిబ్బందిని వేడుకున్నా పట్టించుకోలేదు. దీంతో చేసేదేమీలేక యజమాని తిరిగి ఇంటికి వెళ్లడంతో మేకపిల్ల మాత్రం రెండు రోజులుగా అక్కడే ఉన్నది. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మునిసిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డిని వివరణ కోరగా మొక్కను తిన్న మేక యజమానికి జరిమానా విధిస్తామని, అతను ఇంకా తనను సంప్రదించలేదని చెప్పారు.
మరో వైపు పట్టణంలో నాయకులు నాటిన మొక్కలు సంరక్షణలేక ఎన్నో చనిపో యాయని, పట్టణంలో కుక్కలు, పందులు, ఆవులు గుంపులుగుంపులుగా సంచరి స్తున్నా పట్టించుకోని మునిసిపల్ అధికారులు తన చిన్న మేక పిల్లను బంధించి రూ. 5 వేల జరిమానా విధించాలని చూస్తుండటం తగదని, తాను అంత మొత్తం చెల్లించలేనని టైలర్ రంగ ఆవేదన వ్యక్తంచేశాడు. మేక పిల్లను రెండు రోజులుగా ఇ నుప కడ్డీల మధ్య బంధించిన మునిసిపల్ అధికారులు, సిబ్బంది తీరుపై పట్టణ ప్ర జలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మేకపిల్లను బంధించిన విష యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మునిసి పల్ సిబ్బంది యజమానిని పిలిచి మేకపిల్లను అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధికారులపై మండిపడ్డారు. మూగ జీవిని బంధించడం సరికాదని.. యజమానిని పిలిపించుకొని జరిమానా విధిస్తే సరిపోయేదని అంటున్నారు. ఒక వేళ ఆ మేకపిల్ల చనిపోతే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Haritha haram, Mahabubnagar