Home /News /telangana /

GOAIR ANNOUNCES DIRECT FLIGHTS FROM HYDERABAD TO MALE IN MALDIVES FROM 11TH FEBRUARY SU

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై హైదరాబాద్‌ నుంచి నేరుగా మాల్దీవుల్లో ల్యాండ్ అయిపోవచ్చు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మాల్దీవులు వెళ్లాలనుకునేవారికి గుడ్ ‌న్యూస్. ఇకపై హైదరాబాద్ నుంచి నేరుగా మాల్దీవుల్లో ల్యాండ్ అయిపోవచ్చు.

    మాల్దీవులు వెళ్లాలనుకునేవారికి గుడ్ ‌న్యూస్. ఇకపై హైదరాబాద్ నుంచి నేరుగా మాల్దీవుల్లో ల్యాండ్ అయిపోవచ్చు. హైదరాబాద్ నుంచి మాల్దీవులకు మొదటి డైరెక్ట్ విమానాన్ని ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభించనున్నట్టు గో ఎయిర్ విమానయాన సంస్థ ప్రకటించింది. వారానికి నాలుగు రోజులు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని తెలపింది. ఈ మేరకు గో ఎయిర్ సంస్థ ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన చేసింది. సోమ, మంగళ, గురు, ఆది వారాల్లో హైదరాబాద్ నుంచి మాల్దీవుల్లోని మాలే మధ్య సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ మార్గంలో నెక్ట్స్ జనరేషన్ ఎయిర్‌బస్ A320 నియో ఎయిర్‌క్రాఫ్ట్ సేవలందించనుంది. "హైదరాబాద్‌ నుంచి మాలెకు వెళ్లే ప్రయాణికులు అదనపు ఆప్షన్స్ కల్పిస్తున్నాం. తద్వారా వారి ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ ఆనందదాయకంగా మరియు సౌకర్యంగా ఉంటుంది" అని గో ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కౌశిక్ తెలిపారు.

    హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి G8 1533 ఫ్లైట్ ఉదయం 11.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాల్దీవుల్లోని వెలానా అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుతుంది. మరోవైపు మాలే నుంచి G8 4033 ఫ్లైట్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకోవచ్చు.





    ఇక, ప్రస్తుతం ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఎత్తేయడంతో గో ఎయిర్ సంస్థ మాలే నుంచి ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు నగరాలకు డైరెక్ట్ సర్వీస్‌లను నడుపుతోంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Flight, Hyderabad, Maldives, Shamshabad Airport

    తదుపరి వార్తలు