Home /News /telangana /

GIRLFRIEND COMMITS SUICIDE AFTER LOVER KILLED HIS NEWLY MARRIED WIFE IN KHAMMAM DISTRICT HSN

నవ వధువు హత్య కేసులో ఊహించని మలుపు.. భర్త ప్రేయసి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..

మృతురాలు నవ్య రెడ్డి

మృతురాలు నవ్య రెడ్డి

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందన్న కారణంతో భర్తే భార్యను చంపాడు. ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఆపై అడ్డంగా దొరికిపోయాడు. భర్త ప్రేయసిని పోలీసులు విచారించిన కొద్ది సేపటికే ఆ ప్రేయసి కూడా ఆత్మహత్య చేసుకోవడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ఇంకా చదవండి ...
  ఖమ్మం జిల్లాలోని నవవధువును దారుణంగా హత్య చేసిన ఘటనలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. తన వివాహేతర సంబంధానికి భార్య అడ్డొస్తోందన్న కారణంతోనే భర్త ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే భర్త ప్రేయసిని కూడా విచారించేందుకు పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె మొబైల్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను ప్రాథమికంగా కొన్ని ప్రశ్నలు అడిగి, అవసరం అయితే మళ్లీ వస్తామని చెప్పి వెళ్లారు. ఏమయిందో ఏమో కానీ పోలీసులు ఇంటి నుంచి వెళ్లిన కొద్ది గంటలకే ఆమె రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలేంటన్నది అంతుబట్టలేని విధంగా మారింది. ఈ ఘటన కాస్తా స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

  ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెనికి చెందిన నాగ శేషు రెడ్డికి తమ సమీప నవ్య రెడ్డితో రెండు నెలల క్రిందట పెళ్లయింది. నాగ శేషు రెడ్డి పూణెలో ఉద్యోగం చేస్తుంటాడు. నవ్యకు అతడు స్వయానా మేన మామ కొడుకు. నవ్య సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం భార్య నవ్య రెడ్డి కనిపించడం లేదంటూ భర్త నాగ శేషు రెడ్డి ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పెనుబల్లి మండలం కొత్తలంక పల్లి గ్రామ శివార్లలోని కుక్కల గుట్ట వద్ద నవ్య రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

  ఆమెను భర్తే హత్య చేసి ఉంటాడన్న అనుమానంతో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. భర్త నాగ శేషు రెడ్డి కదలికలపై అనుమానం వచ్చిన పోలీస్ లు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలోని సీసీ కెమెరాలో నమోదు అయిన దృశ్యాల ఆధారంగా నాగ శేషు రెడ్డి ను అదుపులోకి తీసుకుని విచారించగా ఆశలు విషయం వెలుగు చూసింది. బుదవారం రాత్రి సమయం లో నవ్య రెడ్డి ని బైక్ పై తీసుకు వచ్చి కుక్కల గుట్ట వద్ద మత్తు టాబ్లెట్ లు ఇచ్చి అనంతరం చున్ని తో ఉరి వేసి హత్య వేశాడు. ఆ తరువాత హత్య ను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతురాలి సెల్ ఫోన్ నుండి ఆమె తండ్రికి మెసేజ్ చేశాడు.

  ’నాన్నా, నాకు బీటెక్ లో ఇంకా సబ్జెక్టులు ఉన్నాయి. ఈ బ్యాక్ లాగ్స్ ను పాస్ కావడం నా వల్ల కావడం లేదు. అందుకే నేను చనిపోతున్నా‘ అని ఆమె మొబైల్ నుంచే ఆమె తండ్రికి మెసేజ్ పెట్టాడు. ఆ తరువాత ఏర్రు పాలెం పోలీస్ స్టేషన్ లో తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. నాగశేషు రెడ్డి నిజం ఒప్పుకోవడంతో మిస్సింగ్ కేసును కాస్తా, హత్య కేసుగా మార్చి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాధమిక విచారణలో తేల్చారు.

  ఈ క్రమంలోనే నాగ శేషురెడ్డికి సమీపబంధువైన 20 ఏళ్ల గూడూరు వినీలను పోలీసులు విచారించారు. ఆమె ఇంటికి వెళ్లి పలు ప్రశ్నలు అడిగారు. విచారణలో భాగంగానే ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అవసరం అయితే మరోసారి విచారణకు వస్తామనీ, అందుబాటులో ఉండాలని కోరి, వెళ్లిపోయారు. ఇది జరిగిన కొద్ది సేపటికే పెగళ్లపాడు గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ పై వినీల ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. వినీల కూడా బీటెక్ సెకండియర్ చదువుతోంది. పోలీసుల విచారణకు సంబంధించి భయంతో, పరువుపోతోందన్న ఆవేదనతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Crime news, Crime story, Husband kill wife, Khammam, Telangana, Wife kill husband

  తదుపరి వార్తలు