Kamareddy : ఓ ప్రభుత్వ మోడల్ స్కూళ్ హస్టల్లో దయ్యాలు తిరుగుతున్నాయట.. హాస్టల్లో వింత వింత శబ్ధాలు వస్తుండడంతో విద్యార్థినిలను హాస్టలర్ వార్డన్ ఫోన్ చేసి ఇంటికి తీసుకువెళ్లాలని ఫోన్ చేసి చెబుతున్నారు. దీంతో విద్యార్థినిలంతా ఇంటిబటా పట్టారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మోడల్ స్కూల్స్, జూనియర్ కాలేజీలను ప్రారంబించింది.. మండలానికి ఓక మోడల్ స్కూల్, మోడల్ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేసారు... ఈ మోడల్ పాఠశాలలు, కళాశాలు విజయంతంగా నడుస్తున్నాయి.. అయితే కామారెడ్డి జిల్లా నాగిరెడ్టిపేట ఆదర్శ పాఠశాల బాలిక వసతి గృహంలో ఓ వింత పరిస్థితి నెలకొంది. హాస్టల్లో దెయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారం జరగడంతో విద్యార్థినిలు హస్టల్ వదిలి పారిపోతున్నారు.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్టిపేట ఆదర్శ పాఠశాల బాలిక వసతి గృహంలో 60మంది విద్యార్థినులు ఉంటున్నారు. వారం రోజులుగా రాత్రి అయ్యిందంటే చాలు.. వసతి గృహం పరిసరాల్లోంచి వింతవింత అరుపులు, శబ్ధాలు వస్తున్నా యని విద్యార్థినులు చెబుతున్నారు. అలాగే దెయ్యంలా కదులుతున్న నీడలు కనిపిస్తున్నాయని భయాందోళన చెందుతున్నారు. దీంతో మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశామని వార్డన్ చెప్పినా... ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థినిలను ఇంటికి తీసుకువెళ్లాలని హాస్టల్ వార్డన్ ఫోన్ చేసి మరి చెబుతోంది. దీంతో పరుగులు పెట్టిన తల్లిదండ్రులు పిల్లలను హస్టల్ నుండి ఇంటికి తీసుకుని వెళుతున్నారు. దీంతో హస్టల్ పూర్తిగా ఖాళీ అయింది..
అయితే హస్టల్లోనే వాచ్‌మన్‌తో పాటు ఓ వంటమనిషి మరో ఏఎన్ఎం కూడా ఉంటున్నా పిల్లల్లో భయాందోలను కల్గుతున్నాయని ప్రిన్సిపల్ చెబుతున్నారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. అసలు విషయం ఎమిటంటే.. హస్టల్లో కనీసం విద్యుత్ బల్బులు కూడా సరిగా లేవని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో చీకట్లో విద్యార్థులు బయపడుతున్నట్టు వాపోతున్నారు. వారం రోజుల క్రితమే విద్యార్థులను హస్టలకు తీసుకురమ్మని చెప్పిన సిబ్బంది తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనాతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోందన్న ఆందోళనతో తాజాగా ఇలాంటీ పరిణామాలు వారికి నష్టం చేకూరుస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వ హస్టల్లలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఉన్నతాధికారులు వచ్చి పరిష్కరించాల్సిన అవసరం ఉన్నా.. పట్టించుకోకపోవడంతో కింది స్థాయి సిబ్బంది తీసుకునే నిర్ణయాలే అంతిమంగా అమలు అవుతున్నాయి. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందింది హస్టల్ లో మౌలిక వసతులను ఏర్పాటు చేసి వారికి సరైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.