Nizamabad : చిన్నారి చేతిలో మని పర్స్ .. షాపింగ్‌ మాల్‌లో అడుకుంటుండగా....

ప్రతీకాత్మక చిత్రం

Jagityala : షాపింగ్ మాయలో పడి తన కూతురునే మరచి పోయింది.. దీంతో ఓ వైపు తల్లి షాపింగ్ చేస్తుండగానే మరోవైపు చిన్నారీ కనిపించకుండా పోయింది.. ఇద్దరు వ్యక్తులు బురఖా ధరించి పాపను కిడ్నాప్ చేసినట్టు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

  • Share this:
    నిజామాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ చిన్నారీని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నిజామాబాద్ లోని సౌత్‌ఇండియా షాపింగ్‌ మాల్‌లో నేడు సాయంత్రం నిజాబాబాద్  జిల్లా మెట్‌పల్లికి చెందిన నూరిన్ తన మూడేళ్ల కూతురు హసియా పాటు తల్లితో కలిసి షాపింగ్ వెళ్లింది. ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తుండగా షాపింగ్‌ మాల్‌లోనే హనీ ఆడుకుంటుంది. దీంతో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించి షాపింగ్‌లో మునిగిపోయారు.

    ఇలా కాసేపటి వరకు హనీపై ఆలోచన లేకుండా షాపింగ్ ( shopping ) చేశారు. చివరకు షాపింగ్ చేసిన వాటికి బిల్లు చెల్లించేందుకు వెళ్లినప్పుడు గాని హని గుర్తుకు రాలేదు.. దీంతో వెంటనే హని కోసం వెతికారు. దీంతో అప్పటికే హని కనిపించకుండా పోయింది. దీంతో కంగారు పడిన తల్లి షాపింగ్ మాల్ మొత్తం వెతికింది అయినా ప్రయోజనం లేకపోవడంతో నిజామాబాద్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మాల్‌లోని సీసీ కెమెరాలను ( cc camera ) పరీశీలించారు. చిన్నారిని ఇద్దరు బురఖా ధరించిన వ్యక్తులు తీసుకువెళ్లినట్టు గుర్తించారు. దీంతో వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. రోడ్డుపై పికేటింగ్ వేసి నిఘా ఏర్పాటు చేశారు.

    అయితే పాప దగ్గర ఓ పర్సు కూడా ఉందని కాని అందుటో ఎలాంటీ డబ్బులు లేవని పాప తల్లి చెబుతోంది. హనీకి కనీసం మాటలు కూడా రావని , దయచేసి వదిలిపెట్టాలని వేడుకోంటుంది.

    ఇది చదవండి : డబుల్ ఇళ్లపై సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన .. సొంత స్థలాలకు కూడా..


    దొంగలుగా మారిన విద్యార్థులు..

    మరోవైపు హైదరాబాద్‌లోని ( hyderabad ) మల్కజ్‌గిరి ప్రాంతంలో నివాసం ఉండే ముగ్గురు విద్యార్థులు దొంగతనానికి పాల్పడ్డారు. ఏస్‌రావు నగర్‌లోని ఓ జియో మార్ట్‌ షో రూంలో నిన్న రాత్రి చోరీకి పాల్పడి సుమారు నాలుగు లక్షలు ఎత్తుకెళ్లారు. దీంతో ఉదయం వచ్చి చూసిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురిన పట్టుకుని డబ్బులను రికవరి చేశారు. అయితే తాము కాలేజీ ఫిజులు కట్టడం కోసం దొంగతనం చేశామని పోలీసుల విచారణ చెప్పినట్టు సమాచారం. దీంతో వారిపై కేసు నమోదు చేసిన రిమాండ్‌కు తరలించారు.

    ఇది చదవండి : "హుజూరాబాద్ ఈటల రాజేందర్ దళిత బంధు".. అని పేరు పెడితేనే సార్థకం

    Published by:yveerash yveerash
    First published: