Home /News /telangana /

GIRL FRIEND ENTERED INTO MARRIAGE HALL WHEN HER LOVER GETTING MARRAIAGE VRY

Love marriage : ఒకరిని కాదు ఇద్దరిని ప్రేమించాడు.. రెండవ ప్రియురాలు చేసిన పనికి షాక్ తిన్నాడు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Love marriage : పెళ్లి చేసుకునే సమయంలో అదికూడా మరో యువతి మెడలో తాళి కట్టే సమయంలో ..అకస్మాత్తుగా తాను ప్రేమించిన యువతి మండపంలో ప్రత్యక్షమయితే... ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏమిటి.. ఆ ప్రేమికురాలు ఏం చేస్తోంది.. ?

  ప్రేమించడం.. వారికి తెలియకుండా మరో పెళ్లి చేసుకోవడం అనేది నేటి యువకులకు కామన్‌గా మారింది.అయితే ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో కొంతమంది యువతులు... తమ ఖర్మ అనుకుని ఎలాంటీ చర్యలు లేకుండా తమలో తాము కుమిలి పోతారు.. మెల్లగా తేరుకుని మరో కొత్త జీవితం వైపు దృష్టి సారిస్తారు.. అయితే ఒకప్పుడు ఇలాంటీ సంఘనటనలే ఎక్కువగా జరిగేవి. కాని ఆధునిక ప్రపంచలో పరిస్థితులు మారుతున్నాయి. చాలా మంది యువతులు తాము ప్రేమించిన యువకున్ని దక్కించుకునేందకు ఎంతకైనా తెగిస్తున్నారు.. సమాజంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఇలా సంవత్సరాల తరబడి వెంటపడి ప్రేమించిన ప్రియుడు ఆకస్మత్తుగా మనసు మార్చుకున్నా.. మరో పెళ్లికి సిద్దమైనా.. ఇక వాడికి చుక్కలు చూపిస్తున్నారు. ధైర్యం చేసి వాడి తాట తీస్తున్నారు. ప్రేమించినవాడు మోసం చేస్తే ప్రియుడు ఇంటి ముందే ధర్నా చేయడం నుండి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ప్రొసీడ్ అవుతున్నారు. ఇక మరి కొంతమంది ఓ అడుగు ముందుకేసి ఏకంగా పెళ్లిమండపానికి వెళ్లి ఆ పెళ్లిని నిలిపివేయిస్తున్నారు.

  ఇలా తాజాగా ఓ యువతి తన ప్రియుడు మరోకరి మెడలో తాళికట్టే సమయంలోనే మండపంలోకి ఎంటర్ ఆ ప్రియుడి గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేసింది. సంఘటన వివరాల్లోకి వెళితే...మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కోమటిచేను గ్రామానికి చెందిన దుర్గం వినోద్ పదేళ్లుగా చైతన్య అనే యువతితో ప్రేమాయణం సాగించాడు. ఆమెను కాదని ఇటివల జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన మరో యువతి హర్షశ్రీని ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోడానికి సిద్ధమయ్యాడు. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. 2021, డిసెంబర్ 27వ తేదీ సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సీఐ హాల్లో పెళ్లి వేడుకకు సిద్దమయ్యారు.. అయితే.. ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రియురాలు చైతన్య పెళ్లి జరుగుతున్న మండపం వద్దకు వచ్చింది.

  KTR : మరింత మెరుగ్గా టీఎస్ B-PASS.. కొత్త మున్సిపాలీటల మాస్టర్‌ ప్లాన్‌


  దీంతో మొదటి ప్రియురాలు చైతన్యను గమంచిన ప్రియుడి గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి.. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైంది... అనుకున్నట్టుగానే.. మొదటి ప్రియురాలు.. ఎంతమందిని మోసం చేస్తావని నిలదీయడంతో బంధువులు అంతా షాక్‌కు గురయ్యారు. పెళ్లిపై వినోద్‌ను నిలదీయంతో నోట్లో నుండి మాట రాలేదు.. దీంతో వినోద్‌ అసలు రంగు బయటపడిందని తెలుసుకున్న పెళ్లి కూతురు హర్షశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఆమె ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మొదటి ప్రియురాలి చేసిన పనికి తాను పెళ్లి చేసుకోవాలనుకున్న రెండవ ప్రియురాలి చేతిలో కేసుల పాలు అయ్యాడు.

  Electricity bills hike : విద్యుత్ చార్జీల పెంపుకు రంగం సిద్దం.. యూనిట్‌కు ఎంతంటే...?

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Love marriage, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు