న్యూస్ 18 మహబూబ్ నగర్...
సయ్యద్ రఫీ...
రాష్ట్రవ్యాప్తంగా పోడుభూముల వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారుతోంది..గిరిజనులకు, అధికారులకు మధ్య తీవ్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి...రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటున్న అధికారులపై గిరిజనలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగర్ కర్నూలు జిల్లాలో గురువారం పోడు వ్యవసాయన్ని అడ్డుకుంటున్న అధికారులను స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అడ్డుకున్నారు. అనంతరం గిరిజనులకు అండగా నిలబడ్డారు.
కాగా తాజాగా నేడు ఆ వివాదం నాగర్ కర్నూల్ జిల్లాలో పోడు వివాదం చెలరేగింది. జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచవరం గ్రామంలో పోడు భూములు వ్యవసాయం చేస్తూ ఉంటే అడ్డుకుంటున్నారని ఓ మహిళా రైతు అధికారులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ప్రయత్నించింది.దీంతో ఈ సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ స్థానిక అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వెంటనే అక్కడికి చేరుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. అనంతరం ఎమ్మెల్యే అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే... అమ్రాబాద్ మండలం పరిధిలోగల సమాచారం గ్రామంలో 20 ఆదివాసి కుటుంబాలు నివాసం ఉంటున్నాయి అదే గ్రామంలో ఉన్న సుమారు 60 ఎకరాలు భూములు సాగు చేసుకుంటూ ఈ కుటుంబాలు ఏండ్లుగా జీవనం సాగిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఖరీఫ్ సీజన్లో వ్యవసాయం చేయకూడదని గత నెల రోజులుగా అడవి శాఖ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆదివాసి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం భూముల్లో బేస్ లైన్ వేసేందుకు అధికారులు రావడంతో వారి పనులకు గిరిజనులు అడ్డు తగిలారు..అధికారులు తెచ్చుకున్న సున్నం బస్తాలు పగులగొట్టారు. గొలుసు తాడు లను కూడా తెంచేశారు. ఎన్నో ఏళ్లుగా సాగుచేసిన భూముల్లో ఇప్పుడు వ్యవసాయం వద్దనడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. ఇద్దరి మధ్య వాగ్వాదం కొనసాగింది..అయినా అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయిన ఓ ఆదివాసి మహిళా రైతు తన వెంట తెచ్చిన పెట్రోల్‌ను అడవి శాఖ అధికారులపై చెల్లింది. అనంతరం నిప్పు పెట్టేందుకు ప్రయత్నించగా అక్కడున్న కొంతమంది అడ్డుకున్నారు.
ఈ సంధర్భంగా రైతులు మాట్లాడుతూ.. భూముల కోసం చావడానికైనా, చంపడానికి సిద్ధమంటూ పలువురు రైతులు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే త్వరలోనే దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్యే బాలరాజు రైతులకు భరోసా ఇచ్చారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana