హోమ్ /వార్తలు /తెలంగాణ /

Adilabad : నువ్యుల నూనెతో ఆ దేవుడికి నైవేధ్యం... అది తాగిన తర్వాతే ఉత్సవం

Adilabad : నువ్యుల నూనెతో ఆ దేవుడికి నైవేధ్యం... అది తాగిన తర్వాతే ఉత్సవం

Adilabad : ఆదిలాబాద్’లో ఆదివాసీలు జరుపుకునే ఖాందేవుడి జాతర ఘనంగా ప్రారంభమైంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లతో ఆదివాసీలు పూజలు నిర్వహించారు.. ఇంట్లో స్వయంగా చేసిన నువ్వుల నూనేతో అభిషేకం చేశారు.

  ( katta lennin news 18 Telugu Adilabad )

  తరతరాలుగా వస్తున్న సంస్కృతే తమ వారసత్వ సంపదగా చెప్పుకునే ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనులు ఇప్పటికి చెక్కుచెదరకుండా తమ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా వేడుకలు జరుపుకుంటారు. ఇలా దశాబ్దాల కాలం నుంచి తొడసం వంశీయులు పుష్యమాసం పౌర్ణమి రోజున సంప్రదాయంగా కామదేవుని మహాపూజ నిర్వహించడం ఆనవాయితీ. ఆదివాసీల జాతిలో తొడసం వంశీయుల ఆరాధ్య దైవం ఖాందేవుడు కొలువై ఉన్న ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి ఖాందేవుని జాతర ప్రారంభమైంది.

  ఖాందేవునికి మహాపూజ, గంగా జలాలతో అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పది రోజుల పాటు ఖాం దేవుని సన్నిధిలో జాతర కొనసాగుతుంది. అయితే తొడసం వంశస్తుల ఆరాధ్య దైవమైన ఖాందేవునికి ఏటా పుష్య పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసారు. దేవునికి నైవేద్యం పెట్టేందుకు నెలరోజుల ముందే ఆదివాసీలు ఇంట్లో స్వయంగా నువ్వులనూనె తయారుచేస్తారు. అలా తయారు చేసిన నూనెను దేవునికి నైవేద్యంగా సమర్పించేందుకు తీసుకువస్తారు. అలా ప్రతీ ఇంటినుంచి తీసుకువచ్చిన నువ్వుల నూనెను తొడసం వంశానికి చెందిన ఆడపడుచు తాగి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

  Khammam : ఖమ్మంలో విషాదం.. క్రికెట్ ఆడుతుంటే.. చెట్టు కూలి ఇద్దరు మృతి.. మరొకరు విషమం

  మంగళవారం ఉదయం నుంచి ఖాందేవునికి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఈరోజు చిత్తగూడకు చెందిన తొడసం వంశస్తుల ఆడపడుచు మడావి ఏత్మాబాయి రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కుతీర్చుకుంది. ఇలా మొక్కడం వలన సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం. వందేళ్లుగా ఈ ఆచారం వస్తుందని, తొడసం ఆడపడుచులు మూడేళ్లకు ఒకసారి ఒకరు నువ్వుల నూనె తాగాల్సి ఉంటుందని ఆలయ కమిటీ సభ్యుడు తొడసం నాగోరావు తెలిపారు. తెలంగాణ ప్రాంతం నుండే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ నండి తొడసం వంశస్తులు ఈ జాతరకు తరలివస్తున్నారు. ఈ రోజు జరిగిన మహాపూజకు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు రాథోడ్ జనార్ధన్, కోవ లక్ష్మీ, ఆసిఫాబాద్ శాసన సభ్యుడు ఆత్రం సక్కు, పలువురు గిరిజన పెద్దలు, నాయకులు, ప్రజాప్రతినిధులు హజరై ఖాందేవు నికి ప్రత్యేక పూజలు చేశారు.

  First published:

  Tags: Adilabad, Telangana

  ఉత్తమ కథలు