Home /News /telangana /

GHOST TENSION IN GIRL HOSTEL STUDENTS RAN AWAY FROM HOSTEL IN FEAR SEVERAL INJURED IN ADILABAD SK

Telangana: గర్ల్స్ హాస్టల్‌లో దెయ్యం కలకలం.. భయంతో విద్యార్థినుల పరుగులు.. పలువురికి గాయాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: శనివారం ఉదయం కూడా మళ్లీ అలాంటి సీనే కనిపించింది. తరగతి గదులకు వెళ్లిన విద్యార్థినులు... మళ్లీ భయంతో కేకలు వేశారు. అరుస్తూ.. ఏడుస్తూ. ఒకరినొకరు తోసుకుంటూ బయటకు పరుగులు తీశారు

  దెయ్యాలు ఉన్నాయా? లేవా? ఈ కాలంలో కూడా దెయ్యాలు.. భూతాలేంటని కొందరు కొట్టిపారేస్తారు. కానీ మరికొందరు మాత్రం ఇలాంటి వాటిని విశ్వసిస్తారు. స్వయంగా అనుభవం అయితే తప్ప ఎవరికీ అర్ధం కాదని వాదిస్తుంటారు. ఐతే తాజాగా ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని ఓ గర్ల్స్ హాస్టల్‌లో దెయ్యం కలకలం రేగింది. ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల (Tribal Girls hostel)హాస్టల్‌లో దెయ్యం ఉందని విద్యార్థినులు వణికిపోతున్నారు. రాత్రిళ్లు వింత వింత శబ్ధాలు వినిపిస్తున్నాయని..ఏవేవో పీడ కలలు వస్తున్నాయని భయపడుతున్నారు. శుక్రవారం రాత్రికి ఓ విద్యార్థినికి పీడ కల వచ్చింది. తన ఒంటిపై ఎవరో రక్కుతున్నట్లు, కాలుపట్టుకొని లాగుతున్నట్లు అనిపించింది. భయంతో ఆ అమ్మాయి పెద్దగా కేకలు వేసింది. తోటి విద్యార్థినులు కూడా భయంతో వణికిపోయారు. తమకూ ఇలానే జరిగిందని చెప్పారు. హాస్టల్‌లో దెయ్యం ఉందని.. ఏడుస్తూ అందరూ ఒకేసారి బయటకు పరుగులు తీశారు.

  అమ్మాయిలంతా ఒక్కసారిగా బయటకు దూసుకురావడంతో కొందరు అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యయి. విద్యార్థినుల కేకలు, ఏడుపులు విన్న స్థానికులు..ఏం జరిగిందో తెలుసుకునేందుకు హాస్టల్‌ వద్దకు వెళ్లారు. ఎవరూ భయపడవద్దని, తామంతా ఇక్కడే ఉన్నామని ధైర్యం చెప్పారు. గాయపడిన విద్యార్థినులను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాలికల భయాందోళన గురించి ఉపాధ్యాయులకు సమాచారం అందజేశారు. హాస్టల్‌లోకి వెళ్లేందుకు విద్యార్థినులు భయపడుతున్నారని చెప్పినా.. వారు పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోయారు. కనీసం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడంతో విద్యార్థినులకు ధైర్యం చెప్పేందుకు.. రాత్రంతా తాము వసతి గృహంలోనే ఉన్నామని చెప్పారు.

  Godavarikhani : ముక్కలుగా నరికి.. వీధికొకటి విసిరేసి.. మీసేవ ఆపరేటర్ దారుణహత్య.. భార్య పనే

  ఐతే శనివారం ఉదయం కూడా మళ్లీ అలాంటి సీనే కనిపించింది. తరగతి గదులకు వెళ్లిన విద్యార్థినులు... మళ్లీ భయంతో కేకలు వేశారు. అరుస్తూ.. ఏడుస్తూ. ఒకరినొకరు తోసుకుంటూ బయటకు పరుగులు తీశారు. ఆ క్రమంలో 50 మంది బాలికలు కిందపడిపోయారు. హాస్టల్ సిబ్బందితో పాటు స్థానిక ఏఎన్ఎం నచ్చజెప్పినా విద్యార్థులు ఏడుపు ఆపలేదు. హాస్టల్‌లో ఏదో ఉందని.. తమను చంపేస్తుందని కంటతడిపెట్టారు. తాము ఇక్కడ ఉండలేమని తేల్చిచెప్పారు. అప్పటికే కొందరు విద్యార్థులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో..వారు హాస్టల్‌కు చేరుకొని తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ వ్యవహారం చివరకు ఐటీడీఏ పీవో అంకిత్ దృష్టికి వెళ్లింది. విద్యార్థుల్లో భయం పోగొట్టేందుకు స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు.

  Nagarkurnool : కన్నకూతురుపైనే తండ్రి అత్యాచారం -వీడితో వేగలేక భార్య వెళ్లిపోగా

  శనివారం రాత్రి 8.30 గంటలలకు ఆశ్రమ పాఠశాలను సందర్శించారు అంకింత్. పాఠశాలలో దెయ్యం ఉందటూ పిల్లలు భయపడుతున్నారని, వారిని ఇళ్లకు తీసుకెళ్తామని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఐతే అవన్నీ మూఢనమ్మకాలని ఐటీడీఏ పీవో కొట్టిపారేవారు. దెయ్యాలు లేవు..ఏమీ లేవని విద్యార్థినులతో పాటు తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. ఐతే అధికారులకు మరో సమస్య వచ్చి పడింది. దెయ్యం ప్రచారం నేపథ్యంలలో ఆశ్రమ పాఠశాలలో వార్డెన్‌గా విధులు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పిల్లలకు ధైర్యం చెప్పి హాస్టల్‌కు పంపించామని, ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని ఇంచార్జి హెచ్ఎం తెలిపారు.  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Adilabad, Crime news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు