Home /News /telangana /

GHMC WORKERS SHOWING THEIR HAPPINESS ON INCREASE OF THEIR WAGES SAYS THANKS TO KCR AND KTR MS

పారిశుధ్య కార్మికుల సంబురాలు... కేసీఆర్, కేటీఆర్ లకు పాలాభిషేకాలు..

పాలాభిషేకం చేస్తున్న ఓ కార్మికురాలు..

పాలాభిషేకం చేస్తున్న ఓ కార్మికురాలు..

తెలంగాణలో పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచినందుకు గానూ రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సంబరాల్లో మునిగితేలారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.

  • News18
  • Last Updated :
    దీపావళి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు తీపి కబురు అందించిన విషయం తెలిసిందే. వారి జీతాలను మరో రూ. 3 వేలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు సంబురాలు చేసుకుంటున్నారు. తమ కష్టాలను కేసీఆర్ తెలుసుకున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ లో పెంచిన జీతాల ప్రకారం.. పారిశుధ్య సిబ్బందికి రూ. 17,500 జీతం అందనున్న సందర్భంగా నగరంలో పారిశుధ్య కార్మికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు కేసీఆర్, కేటీఆర్ చిత్ర పటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు.

    ఇందిరా పార్కులో జరిగిన పాలాభిషేకం కార్యక్రమానికి పెద్దఎత్తున కార్మికులు హాజరయ్యారు. ఇందిరాపార్కులో ఆదివారం ఉదయం పంచతత్వ పార్కు ప్రారంభోత్సవానికి కేటీఆర్ రాక సందర్భంగా.. పారిశుధ్య కార్మికులు పెద్దఎత్తున అక్కడకు తరలివచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొన్న పారిశుధ్య సిబ్బంది.. కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. తమ జీతాలు పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు.



    ఇందిరా పార్కుతో పాటు.. అల్వాల్ సర్కిల్ వద్ద కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ సిబ్బంది గుమిగూడి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. తమ కష్టాలు కేటీఆర్ కు తెలుసునని.. జీతాలు పెంచినందుకు సంతోషంగా ఉందని పలువురు కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.

    కార్వాన్ సర్కిల్ వద్దకు భారీగా చేరుకున్న మున్సిపల్ కార్మికులు.. కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. మెహిదీపట్నంలోనూ కార్మికులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యకమాలలో స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు.. కార్మికులకు మిఠాయిలు తినిపించారు.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: CM KCR, GHMC, KTR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు