• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • GHMC WARNS OF HYDERABAD PEOPLE REGARDING HUGE RAINFALL AK

Hyderabad Rains: హైదరాబాద్ ప్రజలకు జీహెచ్ఎంసీ హెచ్చరిక

Hyderabad Rains: హైదరాబాద్ ప్రజలకు జీహెచ్ఎంసీ హెచ్చరిక

ప్రతీకాత్మకచిత్రం

GHMC Rain Alert: రాగల కొద్ది గంటల్లో హైదరాబాద్ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచన చేశారు.

  • Share this:
    కొద్దిరోజులుగా తెలంగాణ, ఏపీలోని అనేక ప్రాంతాలను వర్షం ముంచెత్తుతోంది. మరీ ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌ను కుండపోత వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎప్పుడు వర్షం పడుతుందో.. ఎఫ్పుడు నాలాలు పొంగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే తాజాగా రాగల కొద్ది గంటల్లో హైదరాబాద్ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచన చేశారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.



    నగరంలో నివసించే వారంతా ఇళ్లకే పరిమితం కావాలని హెచ్చరించారు. అత్యవసరమైతే 100కు, 040-21111111 నంబర్‌కు, డీఆర్ఎఫ్ బృందాల కోసం 040-295555500 నంబర్‌కు కాల్ చేయాలని జీహెచ్ఎంసీ సూచించింది. గత మూడు రోజులు నుంచి హైదరాబాద్‌లో ప్రతి రోజు వర్షం పడుతుండగా.. శనివారం మధ్యాహ్నం కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు