హోమ్ /వార్తలు /తెలంగాణ /

శ్రీశైలం అడవుల్లోకి హైదరాబాద్‌ పావురాలు తరలింపు

శ్రీశైలం అడవుల్లోకి హైదరాబాద్‌ పావురాలు తరలింపు

Hyderabad Pigeons : హైదరాబాద్‌లో 6 లక్షల పావురాలు ఉంటాయని అంచనా. వాటి వల్ల 15 రకాల వ్యాధులు వ్యాపిస్తుండటంతో... అప్రమత్తమైన అధికారులు వాటిని శ్రీశైలం అడవుల్లోకి తరలిస్తున్నారు.

Hyderabad Pigeons : హైదరాబాద్‌లో 6 లక్షల పావురాలు ఉంటాయని అంచనా. వాటి వల్ల 15 రకాల వ్యాధులు వ్యాపిస్తుండటంతో... అప్రమత్తమైన అధికారులు వాటిని శ్రీశైలం అడవుల్లోకి తరలిస్తున్నారు.

Hyderabad Pigeons : హైదరాబాద్‌లో 6 లక్షల పావురాలు ఉంటాయని అంచనా. వాటి వల్ల 15 రకాల వ్యాధులు వ్యాపిస్తుండటంతో... అప్రమత్తమైన అధికారులు వాటిని శ్రీశైలం అడవుల్లోకి తరలిస్తున్నారు.

  Hyderabad Pigeons : హైదరాబాద్‌కి కొత్తగా వచ్చినవారికి అక్కడి పావురాలు బాగా నచ్చేస్తాయి. కానీ... అక్కడే ఉంటున్న హైదరాబాదీలకు మాత్రం పావురాలతో ఎదురయ్యే సమస్యలు గుర్తుకొస్తాయి. ప్రతీ వీధిలో, అపార్ట్‌మెంట్లపై, ఇళ్ల కన్నాల్లో ఇలా ఎక్కడ చూసినా పావురాలే. వాటి సంఖ్య ఏటా విపరీతంగా పెరిగిపోతోంది. అవి చూడటానికి బానే ఉంటాయి గానీ... వాటి వల్ల వచ్చే వ్యాధులు, వ్యాపించే వైరస్‌లను అడ్డుకోవడం మన వల్ల కావట్లేదు. పైగా వాటి వల్ల చారిత్రక కట్టడాలు పాడైపోతున్నాయి. ఆ కట్టడాల్ని చూసేందుకు వచ్చే పర్యాటకులు... అసహ్యంగా ఉంటున్నాయని ఫీలవుతున్నారు. అందుకే... ఎలాగైనా ఈ సమస్యలకు చెక్ పెట్టాలనుకున్న GHMC... అదనపు పావురాల్ని శ్రీశైలం అడవుల్లోకి తరలించాలని డిసైడైంది. ముందుగా 500 పావురాల్ని మొజాంజాహీ మార్కెట్ ప్రాంతంలో పట్టుకొని... శ్రీశైలం అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేసింది.

  పావురాల్ని అంత దూరంలో వదిలేశాం కదా అని ప్రశాంతంగా ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే పావురాలకు... ఈ భూమిపై ఎక్కడ వదిలినా... తిరిగి వాటి గమ్యస్థానానికి వచ్చేయగలిగే గ్రాహక శక్తి ఉంటుంది. అందువల్ల అవి తిరిగి మొజాంజాహీ మార్కెట్‌కి వచ్చేసే అవకాశాలున్నాయి. నిజానికి పావురాలకు మనుషుల మధ్య ఉండటం చాలా ఇష్టం. ఎందుకంటే... ఇవి ఆహారం కోసం వేటాడేందుకు ఏమాత్రం ఇష్టపడవు. ఎక్కడైనా ఫ్రీగా ఆహారం దొరికితే చాలని ఎదురుచూసే రకం. పైగా వీటి శరీర బరువు ఎక్కువ కాబట్టి... ఎక్కువ సేపు ఎగరలేవు. అందుకే... ప్రజల మధ్యే ఉంటూ... వాళ్లు వేసే గింజలు తింటూ... హాయిగా ఉంటున్నాయి. కానీ... ఇబ్బంది పడుతున్నది ప్రజలే.

  పావురాల వల్ల ఇవీ సమస్యలు :

  * హైదరాబాద్‍‌లో పావురాలు 15 రకాల వ్యాధులు వ్యాపించేందుకు కారణం అవుతున్నాయి.

  * చాలా పావురాలకు రకరకాల వ్యాధులున్నాయి. అవి గాల్లో ఎగురుతుంటే... వైరస్ ప్రజలకు చేరుతోంది.

  * పావురాల వల్ల ప్రజలు ఎక్కువగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు.

  * పావురాల రెక్కలు, ఈకలు, రెట్టలు అన్నీ మనుషులకు ప్రమాదకరమే.

  * ప్రజలకు చర్మం, నోరు, పొట్ట దెబ్బతింటాయి. తలనొప్పి వస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. స్వైన్ ఫ్లూ కూడా వచ్చేలా ఉంది.

  చాలా విదేశాల్లో పావురాల పెంపకంపై నిషేధం ఉంది. కొన్ని చోట్ల ఫైన్లు వేస్తున్నారు. హైదరాబాద్‌లో 560 చోట్ల పావురాల్ని పెంచుతున్నారు. చాలా ప్రదేశాల్లో దాణాలు వేస్తున్నారు. ఇలా పావురాల్ని పెంచవద్దనీ, వాటికి ఆహారం వెయ్యవద్దనీ GHMC అధికారులు కోరుతున్నారు.


  Pics : అందాల నయాగరా... సురభి క్యూట్ ఫొటోస్


  ఇవి కూడా చదవండి :

  నేడు కేసీఆర్ సభ... హుజూర్‌నగర్‌కు వరాలు?

  నేడు హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటు... ఖట్టర్ ప్రమాణ స్వీకారం?

  Health Tips : త్రిఫల చూర్ణం ప్రయోజనాలేంటి... ఎలా వాడాలి?

  Health Tips : పింటో బీన్స్‌ తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

  Health Tips : డయాబెటిస్‌కి ఆవకాడోతో చెక్... ఇలా చెయ్యండి

  First published:

  Tags: Hyderabad, Telangana News, Telangana updates, Telugu news, Telugu varthalu

  ఉత్తమ కథలు