నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు..

నాన్‌వెజ్ ప్రియులకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) షాక్ ఇచ్చింది. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 30న మాంసం, బీఫ్ షాపులు, జంతువధ శాలలు మూసివేయాలని ఆదేశించింది.

news18-telugu
Updated: January 28, 2020, 10:36 PM IST
నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు..
నాన్‌వెజ్ ఐటెమ్స్‌లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.
  • Share this:
నాన్‌వెజ్ ప్రియులకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) షాక్ ఇచ్చింది. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 30న మాంసం, బీఫ్ షాపులు, జంతువధ శాలలు మూసివేయాలని ఆదేశించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మేకలు, గొర్రెలు, పశువుల వధశాలలను మూసివేయాలని తెలిపారు. అలాగే మాంసం, బీఫ్ షాపులను కూడా మూసివేయాలని ఆదేశించారు. నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాలని వెటర్నరీ విభాగం అధికారులు, జోనల్ కమిషనర్లకు ఆయన సూచించారు.

First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు