వినాయక చవితికి మరికొన్ని రోజులే మిగిలి ఉంది. సెప్టెంబరు 2 నుంచి వినాయక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మంటపాల ఏర్పాటు, విగ్రహాల ఎంపికపై ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు భక్తులు. ఈ క్రమంలో హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పలు సూచనలు చేశారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలని విజ్ఞప్తి చేశారు. దైవజ్జ శర్మ అద్వర్యంలో మట్టి గణపతుల తయారీని ప్రోత్సహించేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి కార్యాలయంలో ఆయన ప్రారంభించారు.
నగరంలోని రాజకీయ నాయకులకు సైతం పలు సూచనలు చేశారు రామ్మోహన్. ప్రజా ప్రతినిధులు గణేష్ విగ్రాహాల కోసం చందాలకు ఇవ్వకుండా మట్టి విగ్రహాలను బహుకరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు శంకరయ్య, శ్రీనివాస్ రెడ్డి, మమత, చీఫ్ ఇంజనీర్లు సురేష్, జియాఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్, ఇ.పి.టి.ఆర్.ఐ డిజిలకు మట్టి వినాయకులను అందజేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ganesh Chaturthi, Hyderabad, Telangana