ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి గెలిచిన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ చనిపోయారు. ఆయన గత కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్నారు. ఆయన కొంతకాలంగా కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ, రమేష్ గౌడ్ పరిస్థితి మెరుగుపడలేదు. ఈ రోజు రమేష్ గౌడ్ కన్నుమూశారు. రమేష్ గౌడ్ మృతి పట్ల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లింగోజిగూడ నుంచి రమేష్ గౌడ్ పోటీ చేసి తన ప్రత్యర్థి సిట్టింగ్ కార్పొరేటర్ అయిన టీఆర్ఎస్ నేత ఎం.శ్రీనివాసరావు మీద గెలుపొందారు. ఇక్కడ మొత్తం 8 మంది పోటీ చేశారు. బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, జనసేన, ఇతరులు ముగ్గురు పోటీ చేశారు. అయితే, రమేష్ గౌడ్‌కు ప్రజలు పట్టం కట్టారు. అయితే, ఆయన ప్రమాణస్వీకారం చేయకుండానే కన్నుమూశారు.
2020 డిసెంబర్‌లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ తలపడ్డాయి. ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి డిసెంబర్ 18న చార్మినార్‌లోని భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి బండి సంజయ్ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వార్డు సమస్యలను పరిష్కరిస్తామని, జాతీయవాదానికి, బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని.. వారితో ప్రమాణ పత్రాన్ని చదివించారు.
2016లో ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల పదవీకాలం 2021 ఫిబ్రవరి వరకు ఉంది. దీంతో కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారం ఇంకా పూర్తి కాలేదు. ప్రమాణస్వీకారం కూడా చేయకముందే రమేష్ గౌడ్ కన్నుమూశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక రానుంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ మేయర్ పీఠం దక్కించుకోవడానికి ప్లాన్ చేస్తున్న సమయంలో ఈ ఉప ఎన్నిక కూడా ప్రాధాన్యం కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, GHMC, GHMC Election Result, Hyderabad - GHMC Elections 2020, Telangana