జీహెచ్ఎంసీ మేయర్‌గా ఎన్నికైన కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ టీఆర్ఎస్ నేత జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన కారణంగా ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్‌గా ఎన్నికైన కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ టీఆర్ఎస్ నేత జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన కారణంగా ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నేత అతీష్ అగర్వాల్‌కు జీహెచ్ఎంసీ అధికారులు లక్ష రూపాయల చలానా విధించారు. గ్రౌండ్ లెవల్ నుంచి 15 అడుగులకు మించిన ఎత్తులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని, ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 68 హోర్డింగ్ పాలసీ ప్రకారం ఈ నిబంధన ఉల్లంఘించినందుకు చలానా విధించినట్లు అధికారులు నోటీసులో పేర్కొన్నారు. నిబంధన ఉల్లంఘించినందుకు అధికార పార్టీకి చెందిన వ్యక్తికి కూడా చలానా విధించడంతో.. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారికైనా చలానా తప్పదన్న సంకేతాన్ని అధికారులిచ్చారు. అనధికారికంగా నిబంధనలను అతిక్రమించి ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీని తొలగించారు.
జూబ్లీహిల్స్‌లో టీఆర్ఎస్ భవన్ సర్కిల్ వద్ద ఈ ఫ్లెక్సీని అతీష్ అగర్వాల్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిపై ప్రతిపక్ష బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది. టీఆర్ఎస్ క్యాడర్ సిటీలోని పలుచోట్ల నిబంధనలను ఉల్లంఘించి మేయర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నా ఆమె నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. బంజారాహిల్స్‌లో ఆమె నివాసమంటున్న ప్రాంతంలో కూడా ఇబ్బడిముబ్బడిగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినా ఆమె పట్టించుకోవడం లేదని స్థానిక బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
జీవో నంబర్ 68 పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం హోర్డింగ్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం గ్రౌండ్ లెవల్ నుంచి 15 అడుగుల వరకూ మాత్రమే ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌కు అనుమతి ఉంది. ఈ నిబంధన ఉల్లంఘిస్తే రూ.10 వేల నుంచి లక్ష రూపాయల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. గతేడాది డిసెంబర్ నుంచి ఈ పాలసీని జీహెచ్ఎంసీ అధికారులు కఠినంగా అమలుచేస్తున్నారు. ఆ సమయంలో నిబంధనలను అతిక్రమించి అక్రమ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్స్‌కు భారీగా చలాన్లు విధించారు.
Telangana: నిండు గర్భిణికి కరోనా.. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా 108 వాహనంలోనే ప్రసవం.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Telangana: రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి మంత్రి నిరంజన్‌రెడ్డి కీలక ఆదేశాలు..
No Lock down, curfew: లాక్ డౌన్ , కర్ఫ్యూ ఆలోచన లేదు.. ఒకవేళ పెడితే కొరొనా కంటే ఎక్కువ మరణాలు ఆకలితో ఉంటాయి: పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు
Attacked sanitation workers: మేము మాస్క్ ధరించం.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. అంటూ మున్సిపల్ సిబ్బందిపై పార, గడ్డపారతో దాడి.. ఎక్కడంటే..