హైదరాబాద్‌లో పార్కులు, చెరువులు కబ్జా.. ఈ నెంబర్‌కి ఫోన్ చేయండి..

టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రారంభిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్

1800-599-0099 టోల్ ఫ్రీ నెంబర్ కి పౌరులు ఎవరైనా ఫోన్ చేసి సమాచారం అందించే వెసులుబాటుని అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ కల్పించనుంది.

  • Share this:
    హైదరాబాద్ నగరంలోని పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాలను కాపాడేందుకు ప్రభుత్వం మరో వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టింది. చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాల్లో ఎవరైనా కబ్జాకు పాల్పడినా, అందులో ఇతరత్రా కార్యక్రమాలు చేపట్టినా వెంటనే ప్రభుత్వానికి తెలిపేలా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని ప్రారంభించింది. ఇందుకోసం జీహెచ్ఎంసి డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ప్రత్యేకంగా అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ ను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ని , ఇతర వివరాలను ఈరోజు ప్రగతి భవన్ లో మంత్రి కే తారకరామారావు లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని నగరంలోని చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాల రక్షణకు ప్రభుత్వంతో కలిసి రావాలని మంత్రి కెటియార్ ప్రజలను కోరారు.

    1800-599-0099 టోల్ ఫ్రీ నెంబర్ కి పౌరులు ఎవరైనా ఫోన్ చేసి సమాచారం అందించే వెసులుబాటుని అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ కల్పించనుంది. ఎవరైనా పౌరులు ఫిర్యాదు లేదా సమాచారం అందిస్తే వెంటనే ఒక ప్రత్యేకమైనన ఫిర్యాదుగా నమోదు అవుతుంది. ప్రతి సమాచారానికి లేదా ఫిర్యాదుకు ప్రత్యేకంగా ఒక విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. ఈ విశిష్ట సంఖ్య ద్వారా భవిష్యత్తులో తన ఫిర్యాదు పురోగతిని పౌరులు తెలుసుకునే వీలుంటుంది. ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే అసిస్టెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారికి సమాచారం వెళుతుంది. ఈయన తనకు అందిన సమాచారం లేదా ఫిర్యాదుపైన వెంటనే విచారణ మొదలు పెట్టి చెరువులు, పార్కులు, బహిరంగ ప్రదేశాలను కబ్జాల నుంచి కాపాడే కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ పరిధిలోని జోన్లు, సర్కిళ్లలో ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించారు. అయితే ఫిర్యాదు ఇచ్చే వ్యక్తి తన కోరుకుంటే తన వివరాలు బయటకు రాకుండా గొప్యత పాటించే వెసులుబాటు కూడా ఈ ప్రక్రియలో ఉన్నది. ఈమేరకు సమాచారం లేదా ఫిర్యాదు అందించిన వ్యక్తి వివరాలను బయటకి చెప్పకుండా కాపాడతాయి. పార్కులు, చెరువులు, బహిరంగ ప్రదేశాల అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ అన్ని పని దినాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: