హోమ్ /వార్తలు /తెలంగాణ /

GHMC: కుక్కల బెడదపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. ఆ కుటుంబానికి పరిహారం..

GHMC: కుక్కల బెడదపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. ఆ కుటుంబానికి పరిహారం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

GHMC on Dogs Nuisance: కుక్కల బెడదపై కమిటీ వేయాలని నిర్ణయించింది. కొద్దిరోజుల క్రితం కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి రూ. 8 లక్షల పరిహారం అందించాలని తీర్మానించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్ పరిధిలో వీధి కుక్కల బెడద ఎక్కువ కావడం.. వాటి కారణంగా పలు చోట్ల ప్రజలు గాయపడుతుండటంపై జీహెచ్ఎంసీ(GHMC) కీలక నిర్ణయం తీసుకుంది. కుక్కల బెడదపై కమిటీ వేయాలని నిర్ణయించింది. కొద్దిరోజుల క్రితం కుక్కల (Dogs) దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి రూ. 8 లక్షల పరిహారం అందించాలని తీర్మానించింది. బాధిత కుటుంబానికి కార్పొరేటర్లు నెల వేతనం ఇవ్వనున్నారు.మరోవైపు హైదరాబాద్‌లో(Hyderabad) వీధి కుక్కల బెడద నుంచి విముక్తికి జీహెచ్ఎంసీ ప్రతిష్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కుక్కల దాడి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలని అధికారులు మార్గదర్శకాలు జారీచేశారు.

రాష్ట్ర మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా కుక్కల బెడద నివారణకు మార్గదర్శకాలను జారీచేశారు. రాష్ట్రంలో కుక్కల బెడదను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. జీహెచ్ఎంసీ పరిధిలో జంతు పరిరక్షణకు అనేక చర్యలు చేపడుతున్నారు. నగరంలో జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వాటిని నిర్వహిస్తున్నారు. ఇటీవల పెంపుడు జంతువుల క్రిమిటోరియాలను కూడా ఆరు జోన్లలో ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

అంతే కాకుండా కుక్కల బర్త్ కంట్రోల్ చేయడానికి, దాంతోపాటు రేబిస్ వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా 30 సర్కిళ్లలో 30 వాహనాలను ఏర్పాటు చేసి స్టెరిలైజేషన్ తో పాటు వ్యాక్సినేషన్ చర్యలు చేపడుతున్నారు. గతంలో కుక్కల గణన సందర్భంగా ఐదు లక్షల 75 వేల కుక్కలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అందులో 75 నుంచి 80 శాతం వరకు బర్త్ కంట్రోల్ చేశారు. జంతు పరిరక్షణకు జాతీయ యానిమల్ బోర్డ్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటికే ఫ్రీ మెడికల్ కిట్లు

Preethi: దోషులను వదిలిపెట్టబోం! మెడికో ప్రీతి తల్లితండ్రులకు ఎమ్మెల్సీ కవిత లేఖ

కాగా ఈ నెల 19న కుక్కల దాడిలో అంబర్‌పేట్‌లో నివాసం ఉన్న చిన్నారి ప్రదీప్‌ చనిపోయాడు. దీంతో జీహెచ్ఎంసీ, ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హైకోర్టు బాలుడి మృతి కేసును సుమోటోగా స్వీకరించి..జీహెచ్ఎంసీ, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

First published:

Tags: GHMC, Stray dogs attack

ఉత్తమ కథలు