హోమ్ /వార్తలు /తెలంగాణ /

GHMC fine : నగర మంత్రికి, ఎమ్మెల్యేకు జీహెచ్‌ఎంసీ షాక్.. ఫ్లేక్సీలకు ఫైన్

GHMC fine : నగర మంత్రికి, ఎమ్మెల్యేకు జీహెచ్‌ఎంసీ షాక్.. ఫ్లేక్సీలకు ఫైన్

తలసాని శ్రీనివాస్ యాదవ్(ఫైల్ ఫోటో)

తలసాని శ్రీనివాస్ యాదవ్(ఫైల్ ఫోటో)

GHMC fine : టీఆర్ఎస్ మంత్రికి , ఓ నగర ఎమ్మెల్యేకు జీహెచ్‌ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. ప్లీనరీ సందర్భంగా అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన పార్టీ ఫ్లెక్సీలకు గాను వారిపై జరినామా విధించారు. కాగా ఫ్లేక్సీలకై వివాదం చేలరేగడంతో అధికారులు వారిపై చర్యలు తీసుకున్నట్టు సమాచారం.

ఇంకా చదవండి ...

టీఆర్ఎస్ ప్లీనరీ ( TRS pleanary ) సమావేశాలు అయిపోయిన తర్వాత జీఎహెచ్‌ఎంసీ ( GHMC ) అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలోని హైటెక్స్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీ సంధర్బంగా నగర వ్యాప్తంగా పార్టీకి చెందిన వారితో పాటు నగరంలోని మంత్రుల పేరుతో ఫ్లేక్సీలు వెలిశాయి. దీంతో కాంగ్రేస్‌తో పాటు పలువరు పార్టీ ఫ్లెక్సీలపై ఫిర్యాదు ( complaint ) చేశారు. దీంతో ఫ్లెక్సీల ఏర్పాటుపై దుమారం రేగింది. ఈ క్రమంలోనే విజిలెన్స్ ఎన్‎ఫోర్స్‎మెంట్ డిపార్ట్‎మెంట్ స్పందించింది. గత కొన్ని రోజుల నుంచి సెంట్రల్ ఎన్‎ఫోర్స్‎మెంట్ సెల్ సర్వర్ డౌన్ ఉండటం కారణంగా ఫైన్లను నిలిపేసిన అధికారులు.. నేటి నుంచి మళ్లీ ఫైన్లను వేయడం ప్రారంభించారు. ప్లీనరీ సందర్భంగా బంజారా‎హిల్స్ రోడ్ నెంబర్ 3లో కటౌట్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్‎కు జీహెచ్ఎంసీ 30 వేల రూపాయల ఫైన్ విధించింది. అదేవిధంగా మంత్రి తలసానికి 5 వేల రూపాయల ఫైన్ విధించింది. అయితే ఫ్లెక్సీలు ఏర్పాటుచేయగానే స్పందించకుండా.. అంతా అయిపోయాక, తూతూ మంత్రంగా ఎన్‎ఫోర్స్‎మెంట్ డిపార్ట్‎మెంట్ చలాన్లు విధించిందని పలు విమర్శలు వస్తున్నాయి.

టీఆర్ఎస్ ప్లీనరీ టైంలో నగరమంతా గులాబీ మయంగా మారింది. ఎక్కడ చూసిన టీఆర్ఎస్ జెండాలు, కటౌట్లు, తోరణాలతో నింపేశారు. ఇదే టైంలో సెంట్రల్ ఎన్‎ఫోర్స్‎మెంట్ సెల్.. సర్వర్ డౌన్ అయిందని అధికారులు ప్రకటించారు. కావాలనే జీహెచ్ఎంసీ ఈ విధంగా చేసిందని బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించాయి. విపక్షాలు, సామాన్య ప్రజలకు ఒక న్యాయం.. అధికార టీఆర్ఎస్‎కు ఒక న్యాయమా అంటూ మండిపడ్డారు. అయినా.. పట్టించుకోని బల్దియా అధికారులు ఇప్పుడు ఫైన్ల పేరుతో డ్రామాలాడుతున్నారని విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. చల్లాన్ల వసూళ్లలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి : ఇంట్లో ఒంటరిగా బాలిక.. పక్కింట్లో అదే సమయం కోసం వేచి చూసిన యువకుడు.. చివరకు బాలిక ఇంట్లోకి వెళ్లి..


మరోవైపు ఇందిరాగాంధీ విగ్రహం చట్టు టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని జండాలు తీసి హుస్సెన్ సాగర్‌లో పడవేశారు. దీంతో పోలీసులు చేరుకుని వాడుకుని అడ్డుకుని వారిపై కేసులు సైతం నమోదు చేశారు. అయితే అప్పుడు స్పందించని అధికారులు తాజాగానైనా స్పందించి ఫైన్‌లు వేయడంతో మమ అనిపించినట్టు పలువురు విమర్శలు చేస్తున్నారు.

ఇది చదవండి : విచిత్రం.. తల్లిదండ్రులకు తెలియకుండా గర్భం మెయింటెన్ చేసింది. చివరకు యూట్యూబ్ చూస్తూ..


కాగా బీఎస్పీ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ ( RS Praveen kumar) కూడా కేసీఆర్ కటౌట్లపై కామెంట్స్ చేశారు. ఫుట్‌పాత్‌లు వదలకుండా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తే ఇక నడిచేది ఎక్కడా అంటూ ఆయన ప్రశ్నించారు. అధికారుల తీరును తప్పుబట్టారు. జీహెచ్‌ఎంసీపై ముప్పేట జరుగుతున్న విమర్శల దాడితో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

First published:

Tags: GHMC, Minister talasani srinivas, TRS leaders

ఉత్తమ కథలు