GHMC FINED RS 10000 KARACHI BAKERY FOR SELLING FUNGUS FORMED SWEETS IN HYDERBAD SK
Hyderabad: బూజు పట్టిన స్వీట్స్.. వాటినే అమ్మిన కరాచీ బేకరి.. కస్టమర్ ఫిర్యాదుతో భారీగా జరిమానా
బూజు పట్టిన మైసూర్ పాక్
Hyderabad: కరాచీ బేకరీ యాజమాన్యానికి రూ.10వేల జరిమానా అధికారులు విధించారు. బేకరీలో ఉన్న పలు మిఠాయిలు, ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు.
బూజు పట్టిన స్వీట్స్ అమ్మినందుకు కరాచీ బేకరీ(Karachi Bakery)కి భారీగా జరిమానా పడింది. నిబంధనలను పాటించనందుకు గాను రూ.10వేల జరినామా విధించారు. హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ఓ వ్యక్తి ఖాజాగూడలోని కరాచీ బేకరీలో స్వీట్స్ కొనుగోలు చేశాడు. బేసన్ లడ్డూలతో పాటు మైసూర్ పాక్‌ను కొన్నాడు. ఐతే ఇంటికెళ్లాక తిందామని విప్పి చూస్తే.. మైసూర్ పాక్‌లపై బూజు కనిపించింది. వాటిని ఫొటోలు తీసి ట్విటర్లో పోస్ట్ చేశాడు. తనన ఎదురైన అనుభవంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జీహెచ్ఎంసీ (GHMC)కి, ఇతర అధికారులకు ట్యాగ్ చేశాడు. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ స్వయంగా స్పందించారు. ఖాజాగూడ కరాచీ బేకరీ తనకు పాడైపోయిన స్వీట్లను విక్రయించిందని పౌరుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో అధికారులు రంగంలోకి బేకరీలో తనిఖీలు చేశారు. సర్కిల్ సహాయ వైద్యాధికారి కె.ఎస్.రవి, ఆహార కల్తీ నియంత్రణ అధికారి సూర్య వెంటనే బేకరీకి వెళ్లి లోపల తనిఖీలు చేశారు. బేకరి పరిసరాలు, వంట గదిని పరిశీలించారు. అక్కడ ఎలాంటి పరిశుభ్రత లేకపోవడం, వ్యర్థాలు పేరుకపోవడం, ప్లాస్టిక్ వినియోగం, మురుగు నీటి వ్యవస్థ సవ్యంగా లేకపోవడం, కోవిడ్-19 (Covid-19)నిబంధనలను పాటించడం లేదని నిర్ధారణించారు. ఈ కారణాలను చూపుతూ కరాచీ బేకరీ యాజమాన్యానికి రూ.10వేల జరిమానా విధించారు. బేకరీలో ఉన్న పలు మిఠాయిలు, ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. రిపోర్టులు వచ్చాక వాటి ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ వెల్లడించింది.
ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు బేకరీ యాజమాన్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మార్కెట్లో ఎంతో మంచి పేరున్న బేకరీలో ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. నాణ్యతను పట్టించుకోని ఇలాంటి బేకరీలు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.