గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించాయి. ఇప్పటి వరకు మూడు సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించగా, అవన్నీ టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాయి. గ్రేటర్‌పై మరోసారి గులాబీ జెండా ఎగురుతుందని స్పష్టం చేశాయి. అయితే, బీజేపీ గణనీయంగా పుంజుకుంటుందని, ఓట్ షేర్, సీట్ షేర్ భారీగా పెంచుకుంటుందని చెబుతున్నాయి.
పీపుల్స్ పల్స్
టీఆర్ఎస్ - 68-78
బీజేపీ - 25 - 35
ఎంఐఎం - 38-42
కాంగ్రెస్ - 1-5
ఇతరులు - 0
జీహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డులకు డిసెంబర్ 1న ఎన్నికలు జరిగాయి. అయితే, వాటిలో ఓల్డ్ మలక్ పేట డివిజన్లో పార్టీల గుర్తులు తారుమారు కావడంతో అక్కడ రీ పోలింగ్ జరిగింది. రీ పోలింగ్ కూడా పూర్తి కావడంతో డిసెంబర్ 4న కౌంటింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగడంతో కౌంటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
జీహెచ్ఎంసీలో ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ ఏర్పాటు చేశారు. ఒక హల్ కి 14 టేబుల్స్ ఉంటాయి. ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. మొత్తం 8152 మంది కౌంటింగ్ సిబ్బంది ఉంటారు. 31 మంది కౌంటింగ్ పరిశీలకులు ఉంటారు. కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్ కు సీసీ టీవీలు ఏర్పాటు అయ్యాయి. ఒక రౌండ్ కి 14000 ఓట్లు లెక్కింపు జరగనుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంటుంది. అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాలులోకి రావాలి. బ్యాలెట్ పత్రాలను లెక్కించే కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ లను కౌంట్ చేస్తారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదు అయింది. 74,67,256 ఓట్లు గ్రేటర్ పరిధిలో ఉండగా 34,50,331 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18,60,040 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 15,90,219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.