HOME »NEWS »TELANGANA »ghmc elections 2020 election commission refuses 90 nominations in hyderabad sk

GHMC Elections: ఆ 90 మందికి బిగ్ షాక్.. నామినేషన్ల తిరస్కరణ

GHMC Elections: ఆ 90 మందికి బిగ్ షాక్.. నామినేషన్ల తిరస్కరణ
ప్రతీకాత్మక చిత్రం

GHMC Elections: తిరస్కరణకు గురైన నామినేషన్ల అనంతరం బీజేపీ నుంచి 539 , టీఆర్ఎస్ నుంచి 527, కాంగ్రెస్ నుంచి 348, టీడీపీ నుంచి 202, ఎంఐఎం నుంచి 72, సీపీఐ నుంచి 22, సీపీఐఎం నుంచి 19 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి.

  • Share this:
    గ్రేటర్ పోరు రసవత్తరంగా మారింది. బస్తీ మే సవాల్ అంటూ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం అభ్యర్థులు తొడలు గొడుతున్నారు. నిన్నటితో నామినేషన్ల పర్వం పూర్తవగా.. ఇవాళ స్క్రూటినీ చేశారు అధికారులు. అందులో 90 నామినేషన్లను తిరస్కరించారు. మొత్తం 1893 మంది అభ్యర్థులు 2575 నామినేషన్లు దాఖలు చేయగా.. వీటిలో 90 నామినేషన్లను సంబంధిత రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. తిరస్కరణకు గురైన నామినేషన్ల అనంతరం బీజేపీ నుంచి 539 , టీఆర్ఎస్ నుంచి 527, కాంగ్రెస్ నుంచి 348, టీడీపీ నుంచి 202, ఎంఐఎం నుంచి 72, సీపీఐ నుంచి 22, సీపీఐఎం నుంచి 19 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి. ఇక ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 143, స్వతంత్రులు 613 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి. ఆదివారం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

    నామినేషన్ తిరస్కరణకు గురయిన అభ్యర్థుల్లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడు కూన శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. ఆయన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారన్న విషయం తెలసుకొని.. గాజులరామారంలో ఉన్న జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. కార్యాలయం లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇరువర్గాల ఘర్షణలో ఒక పోలీస్‌తో పాటు మహిళకు గాయలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటన అనంతరం కూన శ్రీశైలం గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసులపై ఎంపీ రేవంత్ మండిపడ్డారు. టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు.



    కాగా, నవంబరు 17న జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే. నవంబరు 18 నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లకు గాను 2575 నామినేషన్లు దాఖలయ్యాయి. 21న నామినేషన్లు పరిశీలించారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబరు 22 వరకు గడువు ఉంటుంది. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. ఇక అవసరమైన ప్రాంతాల్లో డిసెంబరు 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించనున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:November 21, 2020, 20:54 IST

    टॉप स्टोरीज