Home /News /telangana /

GHMC ELECTIONS 2020 BJP WILL WIN IN HYDERABAD ELECTIONS SAYS JP NADDA BA

JP Nadda in Hyderabad: దుబ్బాకలో ధమకా.. నెక్ట్స్ హైదరాబాద్‌లోనే: జేపీ నడ్డా

 జేపీ నడ్డా (File)

జేపీ నడ్డా (File)

GHMC Elections 2020: కమలాన్ని వికసింపజేసేందుకు, అవినీతిని పారద్రోలేందుకు తాము ఎక్కడికైనా వచ్చి ప్రచారం చేస్తామని జేపీ నడ్డా (JP Nadda) స్పష్టం చేశారు.

    దుబ్బాక ఉప ఎన్నికల్లో (Dubbaka ByPolls) భారతీయ జనతా పార్టీ (BJP) ధమాకా మోగిందని, తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోనేనని (GHMC Elections) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా (JP Nadda) అన్నారు. జీహెచ్ఎంసీలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన జేపీ నడ్డా హైదరాబాద్‌లో (Hyderabad) జరిగిన సిటిజన్ మీట్‌లో ప్రసంగించారు. ‘దుబ్బాక ఉప ఎన్నిక బీజేపీకి ధమాకా. ప్రజలు బీజేపీ సంస్కృతికి ఓటు వేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 23.25 శాతం ఓట్లు వచ్చాయి. నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్నాం. దుబ్బాకలో ఓట్ షేర్ 37 శాతానికి పెరిగింది. బీజేపీ కేసీఆర్ కుమార్తె కవిత (Kalvakuntla Kavitha) కూడా ఓడించిందని గుర్తుంచుకోండి.’ అని జేపీ నడ్డా అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన ఓటర్లకు జేపీ నడ్డా అభినందనలు తెలిపారు. ‘దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన ప్రజలకు అభినందనలు. మన ఓట్ షేర్ పెరిగింది. ప్రజలు నరేంద్ర మోదీ (Narendra Modi) అభివృద్ది ఎజెండాను ఎన్నుకున్నారు. దుబ్బాకలో గూండారాజ్‌ను అంతం చేశారు.’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కామెంట్ చేశారు.

    అంతకుముందు హైదరాబాద్‌లోని కొత్తపేట నుంచి నాగోల్ వరకు జేపీ నడ్డా ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్నారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు, కమలాన్ని వికసింపజేసేందుకు తాము ఎక్కడికైనా వస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K.Chandrasekhar Rao) పాలన ముగిసే టైమ్ వచ్చిందని జేపీ నడ్డా అన్నారు. ‘ఈ రోజు భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలను చూస్తుంటే కేసీఆర్ పాలన ముగిసే టైమ్, బీజేపీ పాలన వచ్చే సమయం వచ్చినట్టుగా ఉంది.’ అని జేపీ నడ్డా అన్నారు. తెలంగాణలో అవినీతి పాలనను అంతం చేసేందుకు మోదీ సారధ్యంలో అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. అన్ని డివిజన్లలోనూ బీజేపీని గెలిపించాలని జేపీ నడ్డా ఎన్నికల రోడ్ షోలో ప్రజలను కోరారు.

    కేవలం మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా బీజేపీ అగ్రనేతలను తీసుకొస్తున్నారంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ కమలం నేతల మీద విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలో వారికి జేపీ నడ్డా కౌంటర్ ఇచ్చారు. కమలాన్ని వికసింపజేసేందుకు, అవినీతిని పారద్రోలేందుకు తాము ఎక్కడికైనా వచ్చి ప్రచారం చేస్తామన్నారు. ‘జీహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీ నుంచి పెద్దలు వస్తున్నారని ఎవరో అడుగుతున్నారు. వారికి నేను చెప్పేది ఒకటే. అవినీతి రహిత పాలన కోసం, కమలాన్ని వికసింపజేసేందుకు మేం ఎక్కడికైనా వస్తాం.’ అని జేపీ నడ్డా రోడ్ షోలో ప్రకటించారు.

    యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) రేపు (నవంబర్ 28) హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఎన్నికల ప్రచారం కాకపోయినా.. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పరిశీలించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈనెల 28న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ భారత్ బయోటెక్‌ను సందర్శిస్తారు. కేవలం రెండు గంటల పాటు మాత్రమే ఆయన హైదరాబాద్‌లో ఉంటారు. ఈనెల 29న ఎన్నికల ప్రచారం చివరి రోజున కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, Hyderabad - GHMC Elections 2020, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు