Home /News /telangana /

GHMC ELECTION RESULTS 2020 UPDATES TRS GOT EDGE OVER BJP IN GHMC ELECTION RESULTS IN FIRST ROUND AK

GHMC Election Results 2020: తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యత.. 8 స్థానాల్లో ముందుంజ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

GHMC Election Results 2020: పటాన్ చెరువు, ఆర్‌సీపురం స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. పటాన్ చెరువు గత ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడం గమనార్హం. మిగతా స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతోంది.

    గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే అంశంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీకి ఆధిక్యత లభించడంతో.. సాధారణ ఓట్ల లెక్కింపులో ఎవరిది పైచేయి అవుతుందనే అంశం మరింత ఆసక్తిరేపుతోంది. ఈ క్రమంలో తొలి రౌండ్ కౌంటింగ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యత కనబరిచింది. పటాన్ చెరువు, ఆర్‌సీపురం, ఛందానగర్, హైదర్ నగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, ఓల్డ్ బోయిన్ పల్లి, హఫీజ్ పేట్, బాలా నగర్‌, సరూర్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, కాప్రా, ఓల్డ్ మలక్‌పేట్, చర్లపల్లి, మీర్ పేట్ హెచ్‌బి కాలనీ, భారతీనగర్ స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. గడ్డి అన్నారం, ఆర్కే పురం, మంగళ్ హాట్, దత్తాత్రేయ నగర్, గన్ ఫౌండ్రీ, ఐఎస్ సదన్, బేగం బజార్ వంటి డివిజన్లలో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. ఇందులో పటాన్ చెరువు గత ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడం గమనార్హం. మిగతా స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతోంది. మరికాసేపట్లోనే మెహదీపట్నం డివిజన్‌కు సంబంధించిన తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది.

    ఇక ఓట్ల లెక్కింపులో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అందులో బీజేపీ టీఆర్ఎస్‌పై ఆధిక్యతను సాధించింది. గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లలో కేవలం 1926 పోస్టల్‌ ఓట్లు పోలయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ అత్యధిక ఓట్లను కైవసం చేసుకుంది. 46 డివిజన్లకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ లీడంగ్ సాధించింది. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను బట్టి ఓటింగ్ సరళిని అంచనా వేయలేమని పలువురు అంచనా వేశారు.

    ఇక కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిల్స్‌లో కౌంటింగ్ సెంటర్లను సిద్ధం చేసింది. ఉదయం 8 గంటల నుంచి 150 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఒక్కో రౌండ్‌కి 14,000 ఓట్లను లెక్కించనున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పోలైన ఓట్లను బట్టి.. ముందుగా మెహిదీపట్నం డివిజన్ ఫలితం వెలువడింది. మెహదీపట్నం డివిజన్‌లో 11,818 వేల ఓట్లు పోలయ్యాయి. చాలా వార్డుల్లో 15 నుంచి 27 వేల వరకు ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో 136 డివిజన్లకు సంబంధించిన ఫలితాలు రెండవ రౌండ్లలో వెలువడనున్నాయి. ఇక అత్యధికంగా ఓట్లు పోలైన ఉప్పల్, కంచన్‌బాగ్, మైలార్ దేవరపల్లి, అంబర్‌పేట, రెహమత్‌నగర్, కొండాపూర్, అల్లాపూర్, ఓల్డ్ బోయిన్‌పల్లి, సుభాష్‌నగర్, గాజుల రామారం, తార్నాక, సీతాఫల్ మండి, బన్సీలాల్‌పేట్ ఫలితాలు మూడో రౌండ్‌లో వెలువడే అవకాశం ఉంది.

    ఇదిలా ఉంటే గ్రేటర్‌లోని 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 74,67,256 ఓట్లు ఉండగా 34,50,331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 18,60,400 మంది పురుషులు తమ ఓటు వేయగా, 15,90,219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతరులు 72 మంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: GHMC Election Result, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు