GHMC Election 2020 Updates: ఈసారి GHMC ఎన్నికలకు ఐటీ ఉద్యోగులు దూరంగా ఉన్నట్లు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (TITA) తెలిపింది. పోలింగ్ ప్రక్రియను ఆన్లైన్ చెయ్యడం మంచిదని సూచించింది. ఎందుకంటే... ప్రతిసారీ లాగే... ఈసారి కూడా GHMC ఎన్నికల్లో ఓటర్లు పెద్దగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. ఓటర్ టర్నోవర్ చూస్తే... అంతా కలిపి 46.6 శాతమే. ఎక్కడో బీహార్లోని మారుమూల పల్లెల్లో కనీసం 60 శాతం పోలింగ్ జరిగింది. అన్ని ఏర్పాట్లు ఉన్న... ప్రశాంతమైన హైదరాబాద్లో పోలింగ్ బాగా తక్కువగా జరుగుతుండటంపై టిటా ఏం చెయ్యాలనే అంశాన్ని లోతుగా పరిశీలిస్తోంది. ఈసారి ఎన్నికల్లో 80 శాతం మంది ఐటీ ఉద్యోగులు ఓటు వేయడానికి రాలేదు. కారణం వర్క్ ఫ్రమ్ హోమే. అంటే... పోలింగ్ జరిగిన రోజున కూడా వాళ్లంతా ఉద్యోగాలు చేస్తూ... ఓటు వేయలేకపోయారన్నమాట. తెలంగాణలోని ఐటీ నిపుణులతో... 2010లో టిటా ఏర్పడింది. ఇదో స్వచ్ఛంద సంస్థ (NGO). ఇది తెలంగాణ ఐటీ విద్యార్థులు, ఐటీ కంపెనీలు, ఐటీ ఉద్యోగుల కోసం పనిచేస్తోంది. ప్రతిసారీ ఐటీ ఉద్యోగులు ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆసక్తి చూపట్లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఐటీ ఉద్యోగులు మాత్రం... తమకు ఆసక్తి ఉందనీ... కాకపోతే... ఓటు వేయడానికి అవకాశం దక్కట్లేదని చెబుతున్నారు. ఐతే... ఐటీ ఉద్యోగులంతా ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యేందుకు తప్పగ చేయాల్సింది చాలా ఉందని టిటా అభిప్రాయపడింది.
టిటా ప్రకారం... 5.82 లక్షల మంది ఉద్యోగులు హైదరాబాద్ ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. కానీ... వారిలో చాలా మంది ఇప్పుడు తమ సొంత ఊళ్లలోని ఇళ్లలో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కంపెనీలు వారికి అన్ని సదుపాయాలూ కల్పించాయి. కరోనా పూర్తిగా తగ్గలేదు కాబట్టి... వాళ్లంతా సొంత ఊళ్లలోనే ఉంటున్నారు. అందువల్లే ఐటీ రంగం నుంచి పోలింగ్ బాగా తగ్గిపోయిందని టిటా తెలిపంది. ప్రస్తుతం 25 శాతం మంది ఐటీ ఉద్యోగులు మాత్రమే హైదరాబాద్లో ఉన్నట్లు వివరించింది.
ఏం చెయ్యాలి?
ఐటీ ఉద్యోగులు ఓటు వేసేందుకు వారి కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ లేదా... పోస్టల్ బ్యాలెట్ సిస్టం ఉంటే మంచిదంటోంది టిటా. తద్వారా టర్నవుట్ పెంచవచ్చంటోంది. డిసెంబర్ 1న జరిగిన పోలింగ్లో 46.6 శాతమే టర్నవుట్ రావడంపై దేశవ్యాప్తంగా ఆశ్చర్యం వ్యక్తమైంది. ఈసారి పార్టీలన్నీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేశాయి కాబట్టి.... ఎంతో కొంత ఎక్కువ పోలింగ్ జరుగుతుందని అన్ని పార్టీలూ భావించాయి. తీరా చూస్తే... ఇదివరకటి కంటే... కొద్దిగా మాత్రమే పోలింగ్ పెరిగింది. ఓటు వేసేవారికి ఇన్సెంటివ్లు, టాక్స్ బెనెఫిట్స్ ఇస్తే మంచిదని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.