LIVE NOW

GHMC Elections Results 2020: గ్రేటర్ ఎన్నికల తుది ఫలితాలు ఇవే.. నేరెడ్‌మెట్ ఫలితం నిలిపివేత

Greater Hyderabad Municipal Corporation(GHMC) Election 2020 Results Live Updates: బీజేపీ రాజకీయాలపై విశ్వాసం ఉంచి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. జేపీ నడ్డా, బండి సంజయ్ అద్భుతంగా పనిచేశారని కొనియాడారు.

Telugu.news18.com | December 4, 2020, 10:47 PM IST
facebook Twitter Linkedin
Last Updated December 4, 2020
auto-refresh
Hyderabad GHMC Poll Results 2020:  జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లకు గాను.. 149 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44 స్థానాలను గెలిచింది. కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితమయింది. ఇక నేరెడ్‌మెట్ ఫలితాన్ని రిటర్నింగ్ అధికారి నిలిపివేశారు. స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లు.. మెజారిటీ కంటే ఎక్కువ ఉన్నందున నిలిపేశారు. హైకోర్టు తీర్పు తర్వాతే ఆ ఫలితాన్ని ప్రకటించే అవకాశముంది. ఈ ఎన్నికల్లో అత్యద్భుతమైన ప్రదర్శన కనిబరిచింది బీజేపీ. 2016లో 4 సీట్లు గెలిచిన బీజేపీ ప్రస్తుతం 48 సీట్లు సాధించింది. ఈ విజయాన్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, తెలంగాణ డీజీపీలకు అంకితం చేస్తున్నామని బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన అమిత్ షా, యోగి సహా ముఖ్య నేతలకు బండి సంజయ్ కృతజ్ఞతలు చెప్పారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పిన తాము ఎన్నికల్లో శాఫ్రాన్ స్ట్రైక్ (కాషాయ దాడి) చేశామని అన్నారు. బీజేపీ రాజకీయాలపై విశ్వాసం ఉంచి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. జేపీ నడ్డా, బండి సంజయ్ అద్భుతంగా పనిచేశారని కొనియాడారు.

ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితాలు రాలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. 10-12 సీట్లును స్పల్ప తేడాతో కోల్పోయామని.. ఈ ఫలితాలను చూసి నిరాశ చెందనక్కరలేదని పార్టీ వర్గాలకు సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. టీఆర్ఎస్‌ను అతిపెద్ద పార్టీగా నిలబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. మేయర్ పీఠంపై కూర్చునేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉందన్నారు మంత్రి కేటీఆర్.
Read More
8:48 pm (IST)

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్


Load Moreమరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నారు. 150 నియోజకవర్గాలున్న జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ కేవలం 2 చోట్ల మాత్రమే గెలిచింది. 2016లో కూడా రెండు సీట్లు గెలిచిన హస్తం పార్టీకి మరోసారి అదే ఫలితాలు వచ్చాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి మీడియానే కారణమని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మీడియా తమను ఎక్కడా చూపించలేదన్నారు. 2016 ఎన్నికల్లో 10.4 శాతం ఓట్లు సాధించిన వారిని కనీసం చూపలేదని, బీజేపీ వారిని మాత్రం బాగా ప్రొజెక్ట్ చేశారని విమర్శించారు. ఇంత జరిగినా కూడా తాము ఈ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన చూపించామని, 2016తో పోలిస్తే 4 శాతం అదనపు ఓట్లు సాధించామని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రానందున హంగ్ ఏర్పడింది. ఇక ఈసారి మేయర్ పీఠం మహిళ (జనరల్)‌కు రిజర్వ్ అయి ఉంది. దీంతో మహిళా మేయర్ ఎవరు అవుతారనేది ఆసక్తికరంగా మారింది. మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి గెలుపొందారు. ఆమె కూడా మేయర్ రేసులో ఉన్నారు. ఇక పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కూడా విజయం సాధించారు. ఆమె కూడా మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. హబ్సిగూడ డివిజిన్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సురేష్ రెడ్డి సతీమణి బేతి స్వప్న రెడ్డి ఓడిపోయారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కంచుకోట లాంటి మోండా మార్కెట్‌లో కూడా బీజేపీ జెండా ఎగిరింది.
corona virus btn
corona virus btn
Loading