కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జీహెచ్ఎంసీ తీర్మానం...

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్సీలను వ్యతిరేకిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసింది.

news18-telugu
Updated: February 8, 2020, 6:59 PM IST
కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జీహెచ్ఎంసీ తీర్మానం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్సీలను వ్యతిరేకిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసింది. మేయర్ బొంతు రా్మోహన్ ఆధ్వర్యంలో సమావేశమైన జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఈ మేరకు తీర్మానం చేసింది. దేశంలోనే ఓ మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం ఇదే తొలిసారి. కేంద్ర ప్ర‌భుత్వం రూపొందించిన సీఏఏకు వ్య‌తిరేకంగా  డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్ బ‌ల్దియా స‌మావేశంలో తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ... సెక్యుల‌రిజానికి నిద‌ర్శ‌నంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిలుస్తున్నార‌ని, కేంద్ర ప్ర‌భుత్వం రూపొందించిన సీఏఏ కు వ్య‌తిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామ‌ని ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపారు.  ముఖ్య‌మంత్రిని స్ఫూర్తిగా తీసుకొని సీఏఏను వ్య‌తిరేకిస్తూ ప్ర‌తిపాదించిన తీర్మానం ప్రాధాన్య‌త‌ను వివ‌రించారు. దీనికి స‌మావేశంలో అంద‌రూ ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపారు.

మోదీతో కేసీఆర్‌ భేటీ (file)


అంతకుముందు 2020-21 సంవ‌త్స‌రానికి న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌ను జిహెచ్ఎంసీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఏక‌గ్రీవంగా ఆమోదించింది. 2020-21కి రూ. 6,973 కోట్ల 64ల‌క్ష‌ల‌తో బ‌ల్దియా బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దానిలో రోడ్ల అభివృద్ది, డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌కు రూ. 1,593.64 కోట్ల కేటాయించారు. భ‌వ‌న నిర్మాణ‌, వ్య‌ర్థాలపై విధిస్తున్న జ‌రిమానాల‌ను అధ్యయ‌నం చేసేందుకు క‌మిటిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Early polls for ghmc,greater Hyderabad municipal elections,trs,cm kcr,bjp,kishan reddy,ktr,mim,asaduddin,mim,జీహెచ్ఎంసీలో ముందస్తు ఎన్నికలు,టీఆర్ఎస్,కేసీఆర్,కిషన్ రెడ్డి,కేటీఆర్,ఎంఐఎం,అసదుద్దీన్
జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయం
తెలంగాణలో సీఏఏ, ఎన్ఆర్‌సీలను వ్యతిరేకిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సీఏఏ దేశానికి మంచిది కాదని, వందకు వంద శాతం ఇది తప్పుడు నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఈ చట్టాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే కుండబద్దలు కొట్టినట్లు చెప్పామన్నారు. సీఏఏ చట్టంపై ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులతో మాట్లాడినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. త్వరలోనే ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులతో ఓ సమావేశం నిర్వహిస్తామని.. అందుకే తానే చొరవ తీసుకుంటానని తెలిపారు. ఆ సమావేశం హైదరాబాద్‌లోనే ఉంటుందని వెల్లడించారు. సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని స్పష్టం చేశారు.

మోదీ, అసదుద్దీన్, కేసీఆర్
మోదీ, అసదుద్దీన్, కేసీఆర్


టీఆర్‌ఎస్‌ సెక్యులర్ పార్టీ అని చెప్పిన సీఎం కేసీఆర్.. ఎవరికో భయపడి తమ సిద్ధాంతాలు మార్చుకోమని స్పష్టం చేశారు. ‘మేం ఎవరికీ భయపడం. ఏ పనినైనా స్పష్టతతో చేస్తాం. సీఏఏను పార్లమెంట్‌లోనే వ్యతిరేకించాం. దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సమానం అని రాజ్యాంగం ఉంది. అలాంటప్పుడు ముస్లింలను మాత్రం పక్కకు పెడతా అంటే ఎలా? ఇది నాకు బాధ కలిగిచింది. హోం మంత్రి ఫోన్‌ చేస్తే కూడా అదే చెప్పాను’ అని కేసీఆర్ వివరించారు.
First published: February 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు