పావురాల కారణంగా ప్రజలకు అనేక ప్రాణాంతకమైన వ్యాధులు వస్తుండటంతో పాటు వాటి వల్ల చారిత్రక కట్టడాలు కూడా పాడైపోతున్నాయనే నిర్ధారణకు వచ్చింది ప్రభుత్వం. ఈ కారణంగానే నగరంలో వేల సంఖ్యలో ఉన్న పావురాలను పట్టుకుని అడవుల్లో వదిలేసే ప్రక్రియను జీహెచ్ఎంసీ, ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందుకు అటవీ శాఖ అధికారులు సాయం తీసుకుంటున్నారు. ఇప్పటికే మొజాంజాహీ మార్కెట్ దగ్గర 500 పావురాలను పట్టుకొని శ్రీశైలం అడవుల్లో వదిలేశారు. ఈ క్రమంలోనే పావురాలకు దాణా వేయడంపైనా జీహెచ్ఎంసీ నిషేధం విధించింది.
పావురాలకు దాణా వేస్తే ఫైన్ వేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మోజంజాహి మార్కెట్లో పావురాల ఫీడింగ్కు విక్రయిస్తున్న జొన్నలను వెటర్నరీ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీహెచ్ఎంసీకి చెందిన అన్ని ఉద్యానవనాల్లో పావురాలకు ఫీడింగ్ ఇప్పటికే నిషేధించిన ప్రభుత్వం... ప్రజలు కూడా పావురాలకు దాణా వేయకుండా కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.