• Home
 • »
 • News
 • »
 • telangana
 • »
 • GHATKESAR B PHARMACY STUDENT COMMIT SUICIDE 10 DAYS AFTER FAKE KIDNAP DRAMA FULL DETAILS HERE HSN

కిడ్నాప్ డ్రామా ఆడిన ఘట్‌కేసర్‌ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య.. ఒక్క అబద్ధపు ఫోన్ కాల్ తో చివరకు ఇలా..

సీసీ టీవీ ఫుటేజీలో యువతి (ఫైల్ ఫొటో)

పది రోజుల క్రితం కిడ్నాప్ డ్రామా ఆడి హైదరాబాద్ లో కలకలం రేపిన బీఫార్మసీ కథ విషాదాంతంగా మారింది. కాలేజీకి వెళ్లి తిరిగొస్తుండగా కిడ్నాప్ అయ్యానంటూ తల్లికి ఫోన్ చేసి పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన యువతి చివరకు దారుణ నిర్ణయం తీసుకుంది.

 • Share this:
  పది రోజుల క్రితం కిడ్నాప్ డ్రామా ఆడి హైదరాబాద్ లో కలకలం రేపిన బీఫార్మసీ కథ విషాదాంతంగా మారింది. కాలేజీకి వెళ్లి తిరిగొస్తుండగా కిడ్నాప్ అయ్యానంటూ తల్లికి ఫోన్ చేసి పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన యువతి చివరకు దారుణ నిర్ణయం తీసుకుంది. కిడ్నాప్ డ్రామా అంతా ఫేక్ అని పోలీసులు తేల్చడంతో ఇంటా బయటా తీవ్ర విమర్శలువచ్చాయి. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయినట్టు సమాచారం. ఘటన జరిగిన తర్వాత ఆ యువతి తన అమ్మమ్మ వాళ్లింట్లో ఉంటోంది. ఈ పది రోజులుగా కూడా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఇంట్లోనే ఉండిపోయింది. తీవ్ర మనస్తాపంతో మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గుర్తించి ఆమెను కుటుంబ సభ్యులు ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం ఆమె మృతి చెందింది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

  రాంపల్లిలోని ఆర్ఎల్ నగర్‌కు చెందిన ఓ యువతి కండ్లకోయలోని ప్రైవేట్ కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది. ఫిబ్రవరి పదో తారీఖున బుధవారం సాయంత్రం కాలేజీ ముగిసినా ఇంటికా రాలేదు. చీకటి పడడంతో తల్లి ఆ యువతికి ఫోన్ చేసింది. చాలా సేపటి వరకు ఆ యువతి తన ఫోన్ ను లిఫ్ట్ చేయలేదు. కొద్ది సేపటి తర్వాత తల్లికి ఫోన్ చేసి, తనను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడని తెలిపింది. దీంతో భయపడిపోయిన ఆ తల్లి వెంటనే డయల్ 100కి కాల్ చేసి సమాచారం అందించింది. యువతి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అన్నోజిగూడ ఓర్ఆర్ఆర్ సర్వీస్ రోడ్డు సమీపంలో పోలీసులు గాలించారు. ఆమెకు పోలీసులు ఫోన్ చేసి మాట్లాడారు కూడా. ఎక్కడ ఉన్నావన్నది వాట్సప్ లో లొకేషన్ పెట్టమని కూడా అడిగారు. చివరకు రోడ్డు పక్కన ఆ యువతి కనిపించడంతో ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత తనను ఆటో డ్రైవర్లు గ్యాంగ్ రేప్ చేశారని చెప్పింది.
  ఇది కూడా చదవండి: నా భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు.. 54 రోజుల తర్వాత ట్విస్ట్.. బయటపడిన భార్య బండారం.. అసలేం జరిగిందంటే..

  ఆమె వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. అనంతరం ఫిబ్రవరి 11న ఉదయం నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. ఐతే బాధితురాలు చెప్పిన వివరాలకు, క్షేత్రస్థాయి వాహనాలకు పొంతన లేకపోవడంతో.. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలకు మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ రోజు సాయంత్రం ఘట్‌కేసర్, యానాంపేట్, అన్నోజిగూడ్ ప్రాంతాల్లో యువతి తనకు బాగా తెలిసిన యువకుడితో సంచరించినట్లు పోలీసుగు గుర్తించారు. అంతేకాదు ఆ సమయంలో ఆటో డ్రైవర్ల సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆ ప్రాంతాల్లో లేవు. పోలీసులకు సీన్ అర్ధమయింది. యువతిని మరోసారి గట్టిగా ప్రశ్నించడంతో.. అసలు నిజం కక్కేసింది. చీకటి పడినా ఇంటికి ఎందుకు రాలేదని తల్లి పదే పదే ఫోన్ చేయడంతో.. తనను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసినట్లు కట్టుకథ అల్లింది. ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదనీ, ఎవరూ రేప్ చేయలేదని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు విచారణలో తమకు ఆటో యూనియన్లు బాగా సహకరించారని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. పోలీసుల తరపున వారికి క్షమాపణలు చెప్పారు.
  ఇది కూడా చదవండి: 500 సార్లు వీర్యదానం చేసిన తండ్రి.. అమ్మాయిల జోలికి వెళ్లేందుకే భయపడిపోతున్న కొడుకు.. అసలు కథేంటంటే..

  కాగా, ఈ ఘటన జరిగిన తర్వాత ఆమె మానసికంగా బాగా కుంగిపోయింది. వాతావరణం మార్పు కోసమంటూ తన అమ్మమ్మ వాళ్లింట్లో ఆ యువతి పది రోజులుగా ఉంటోంది. ఈ పది రోజులుగా స్నేహితులతోనూ, బంధువులతోనూ సరిగా మాట్లాడలేదు. ఒంటరిగానే ఉంటోంది. కుటుంబ సభ్యులు కూడా ఆమెను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. అయితే ఈ మంగళవారం రాత్రి ఆ యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. హుటాహుటిన కుటుంబ సభ్యులు మేడ్చల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుత్రిలో చికిత్స పొందుతూనే ఆ యువతి బుధవారం ఉదయం మరణించింది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కిడ్నాప్ డ్రామా ఆడిన ఆ యువతి జీవితం ఇలా విషాదాంతంగా ముగిసింది.
  ఇది కూడా చదవండి: నిర్మానుష్యంగా ఉన్న అతిథిగృహం.. యువకుడితో వెళ్లిన ఓ యువతి.. గెస్ట్ హౌస్ యజమాని కుమారుడు చూసి..
  Published by:Hasaan Kandula
  First published: