Corona Hospitals : రద్దు కాదు..బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పించండి... ప్రైవేటు ఆసుపత్రులపై హైకోర్టు

రద్దు కాదు..బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పించండి... ప్రైవేటు ఆసుపత్రులపై హైకోర్టు

Corona Hospitals : కరోనా చికిత్సలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..అధిక ఫీజులు వసూలు చేసిన ఆసుపత్రులకు రద్దుతో పాటు లక్షల రూపాలయను దోపిడి చేసిన ఆసుపత్రుల నుండి రోగులకు తిరిగి ఇప్పించాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించింది.

  • Share this:
కరోనా చికిత్సలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..అధిక ఫీజులు వసూలు చేసిన ఆసుపత్రులకు రద్దుతో పాటు లక్షల రూపాలయను దోపిడి చేసిన ఆసుపత్రుల నుండి రోగులకు తిరిగి ఇప్పించాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించింది.

కరోనా రోగులను రాష్ట్రంలోని అనేక అసుపత్రులు పీల్చిపిప్పి చేస్తున్న విషయం తెలిసిందే.. దీంతో ప్రైవేటు దోపిడిపై హైకోర్టు నేడు మరోసారి విచారణ చేపట్టింది..కాగా ఈ విచారణకు వైద్య ఆరోగ్య శాఖ డైరక్టర్ శ్రీనివాస రావు హజరయ్యారు. ఈనేపథ్యంలోనే ప్రైవేటు ఆసుపత్రులపై మొత్తం 174 ఫిర్యాదులు వచ్చాయని,వాటిలో 21 ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నట్టు కోర్టుకు తెలిపారు. అయితే ప్రభుత్వ చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటే సరిపోతుందా..అంటూ ప్రశ్నించింది. చర్యలతో పాటు బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పించడం ముఖ్యమని సూచించింది. ఈ నేపథ్యంలోనే లైసెన్స్‌ల రద్దుకు బదులు అధిక ఫీజులను తిరిగి ఇవ్వకపోతే రద్దు చేస్తామని హెచ్చరిస్తే బాగుండేదని కోర్టు అభిప్రాయపడింది. ఇక ప్రభుత్వం చర్యలు తీసుకుని అనుమతిని రద్దు చేస్తే..డబ్బులు ఎలా తిరిగి ఇస్తాయని ప్రశ్నించింది.

దీంతో బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పిస్తామని కోర్టుకు హామి ఇచ్చారు శ్రీనివాస రావు. ఇలా మొదటి వేవ్‌లో మూడు కోట్ల రూపాయలను ఆసుపత్రుల నుండి బాధితులకు ఇప్పించామని చెప్పారు. అయితే సెకండ్ వేవ్‌లో ధరలు ఎందుకు సవరించలేదని ప్రశ్నించింది. దీంతో పాటు సెకండ్ వేవ్‌లో కోవిడ్ చికిత్సల ధరలపై జీవో విడుదల చేసి తదుపరి విచారణలోగా వెబ్‌సైట్‌లో పెట్టడడంతోపాటు కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు.దీంతో గతంలో ప్రభుత్వం హామి ఇచ్చినట్టుగా మరో పద్నాలుగు ఆర్టీపీసిఆర్ టెస్టులకు సంబంధించి కొత్త ల్యాబ్‌లను కూడ ఏర్పాటు చేయాలని చెప్పింది.
Published by:yveerash yveerash
First published: