ఈ నెలాఖరులోనే లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్..సమయం లేదు మిత్రమా..

రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నా ప్రధాని మోదీ కనీసం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత రైతుల కష్టాలు తీరుతాయని.. పంటకు మద్దతు ధర కల్పిస్తారని చెప్పారు.

news18-telugu
Updated: March 29, 2019, 4:51 PM IST
ఈ నెలాఖరులోనే లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్..సమయం లేదు మిత్రమా..
ఉత్తమ్ కుమార్ రెడ్డి (File)
news18-telugu
Updated: March 29, 2019, 4:51 PM IST
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ రాజకీయాలూ మళ్లీ ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్..లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలన్న అంశంపై పార్టీ కార్యకర్తలకు టెలీకాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నెలాఖరులోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని చెప్పారు. సమయం తక్కువగా ఉందని..ప్రతి కార్యకర్తా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఫిబ్రవరి ఆఖరులోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. సమయం లేనందున అందరు కలిసికట్టుగా కష్టపడి పనిచేయాలి. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ- ప్రధాని మోదీ మధ్య జరిగే ఎన్నికలు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి అందరం కష్టపడి పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునేవారు ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలి. నెలాఖరుకు అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తాం. ప్రచారసభల్లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొంటారు. లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీచేయను.
ఉత్తమ్ కుమార్, టీపీసీసీ చీఫ్
తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌ నుంచి జిల్లా, మండల స్థాయి నాయకులతో ఉత్తమ్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా.. మతరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత రైతుల కష్టాలు తీరుతాయని.. పంటకు మద్దతు ధర కల్పిస్తారని చెప్పారు. బూత్ స్థాయి కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కష్టించి పనిచేయాలని నేతలకు సూచించారు ఉత్తమ్.
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...