Home /News /telangana /

GENCO OFFICIALS SAID THAT THERE WILL BE POWER CUTS IN TELANGANA FOR TWO DAYS DUE TO POWER SHORTAGE PRV

Power cuts: తెలంగాణ ప్రజలకు షాక్​.. రెండు రోజుల పాటు కరెంట్​ కోతలు.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం శాపంలా పరిణమించే అవకాశం కన్పిస్తోంది. కొద్దిరోజుల వరకు కరెంట్​ కష్టాలు తప్పేలా లేవు. దీనిని అధికారులు సైతం ధ్రువీకరించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ (Central Government) నిర్ణయం శాపంలా పరిణమించే అవకాశం కన్పిస్తోంది. కొద్దిరోజుల వరకు కరెంట్​ కష్టాలు  (Power Cuts)తప్పేలా లేవు. దీనిని అధికారులు సైతం ధ్రువీకరించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? విద్యుదుత్పత్తి సంస్థలకు (Power Generation Companies) బకాయిలు చెల్లించలేదన్న కారణంతో.. ఇంధన ఎక్స్‌చేంజిలో తెలంగాణ (Telangana) సహా పలు రాష్ట్రాల విద్యుత్ అమ్మకాలు, కొనుగోళ్లపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. కేంద్ర వెల్లడించిన లెక్కల్లో అన్ని తప్పులే ఉన్నాయని పలు రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో బకాయిల లెక్కల సరిచూసిన కేంద్రం.. తప్పులను సవరించింది. ఏపీ సహా ఆరు రాష్ట్రాలు సమర్పించిన లెక్కలు సరిచూశాక వాటిపై నిషేధాన్ని తొలగించింది. ఐతే తెలంగాణ మాత్రం బకాయి ఉందని నిషేధాన్ని కొనసాగిస్తోంది. తెలంగాణ డిస్కంలు ఆగస్టు 18 నాటికి బకాయిలపై 'ఆలస్య రుసుం సర్ఛార్జి' (LPS) రూ.52.85 కోట్లు చెల్లించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ సొమ్మును చెల్లిస్తేనే విద్యుత్ కొనేందుకు అనుమతిస్తామని తెలిపింది.

  కొనుగోలు చేయకుండా ఆదేశాలు..

  దీంతో తెలంగాణకు (Telangana) పవర్​ కష్టాలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో కొనుగోలు చేయకుండా ఆదేశాలు ఇచ్చిందని ట్రాన్స్‌కో, జెన్‌కో (Genco) సీఎండీ ప్రభాకర్‌రావు  (Prabhakar rao)ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశాల వల్ల 20 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఇవాళ డ్రా చేయలేకపోయామన్నారు. కేంద్రం ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు.

  Mulugu: ఇన్సురెన్సు కట్టిస్తే వచ్చే జీతం, కమిషన్​ చాలడం లేదని ఆ ఏజెంట్​ ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో తెలుసా?

  డిస్కం, జనరేటర్‌లకు పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ ఉంటుందని, ఇది వారి ఒప్పందంతో అమ్ముకోవచ్చని సీఎండీ (CMD) పేర్కొన్నారు. రానున్న ఒకటి, రెండు రోజుల్లో కరెంటు సరఫరాకు కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని, ప్రజలు సహకరించాలని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఒక ప్రకటనలో కోరారు. ‘పాత బకాయిలు రూ.1360 కోట్లు చెల్లించినా, కరెంటు కొనకుండా ఆపడం బాధాకరం. దీనిపై శుక్రవారం సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని సీఎం (CM) సూచించారు. జలవిద్యుత్‌ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాం. కొరత రాకుండా చూస్తున్నాం. శుక్రవారం రాష్ట్రంలో 12,214 మెగావాట్ల డిమాండ్‌ వచ్చినా.. కోతలు విధించలేదు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుంది. అప్పటివరకు సరఫరాలో అంతరాయం ఏర్పడినా రైతులు, ప్రజలు సహకరించాలి’ అని ప్రభాకర్‌రావు కోరారు.  45 రోజుల్లోగా చెల్లించాలి..

  కాగా, డిస్కంలు ఏదైనా విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి విద్యుత్ కొంటే 45 రోజుల్లోగా డబ్బు చెల్లించాలి. ఈ గడువు దాటితే ఆలస్యం చెల్లింపు జరిమానా కట్టాలని కేంద్రం ఆదేశాలున్నాయి. వీటి కిందనే తెలంగాణ డిస్కంలు రూ.52.85 కోట్ల తెలంగాణ డిస్కంలు కట్టాలని స్పష్టం చేసింది. ఐతే ఈ బకాయిల లెక్కలని మరోసారి సరిచూడాలని.. తాము అంత బకాయి పడలేదని డిస్కంలు వాదిస్తున్నాయి. కేంద్రం నుంచి సరైన విధంగా స్పందన రాకుంటే.. కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నాయి.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Central governmennt, ELectricity, Power cuts, Telangana Government

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు