హోమ్ /వార్తలు /తెలంగాణ /

Breaking : ఇప్పుడు ఓకే... గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనా చారి..

Breaking : ఇప్పుడు ఓకే... గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనా చారి..

mlc madhusudanachary : స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేయగా.. మరోవైపు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయిన మాజీ స్పీకర్ మధుసూదనా చారిని ( mlc madhusudanachary ) ఆమోదిస్తూ.... గెజిట్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ వెలువడింది.

ఇంకా చదవండి ...

  సాధారణంగా నామినేట్ అయ్యో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపిక ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు జరగిన రాజకీయా పరిణామాల నేపథ్యంలో అనుహ్యాంగా తెరపైకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేత పాడి కౌశిక్ రెడ్డి ( Padi Koushik reddy ) టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకోవడంతో ఆయన్ను సామాజిక సేవా రంగం కింద గవర్నర్ కోటాలో ( Governor qouta ) ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అధినేత నామినేట్ చేస్తూ.. గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపారు. అయితే కౌశిక్ రెడ్డిపై పలు కేసులు ఉండడంతో పాటు గవర్నర్ ఆయన పేరును అమోదించలేదు.. ఇలా కౌశిక్ రెడ్డి పేరును పంపి మూడు నెలలు గడుస్తున్నా ఆయన పేరును గవర్నర్ తమిళి సై అమోదించలేదు.

  దీంతో రూటు మార్చిన టీఆర్ఎస్ అధినేత సీఎం కేసిఆర్ హుజూరాబాద్ ( Huzurabad ) ఎన్నికల ఫలితాల అనంతరం ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరిగి కౌశిక్ రెడ్డిని ఎంపిక చేశారు. దీంతో ఆయనకు బదులుగా మాజీ స్పీకర్ మధుసూదనా చారిని నామినేట్ చేస్తూ మరోసారి పంపారు. దీంతో నెల రోజుల తర్వాత మధుసూదన చారిని ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదించిన అనంతరం గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది.

  mlc elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్...కరీంనగర్‌లో మాట నిలబెట్టుకున్న మంత్రి

  కాగా మధుసూదనాచారి (mlc madhusudanachary ) తెలంగాణ రాష్ట్ర సమితి అవిర్భావం నుండి సీఎం కేసిఆర్ వెన్నంటే ఉండి పార్టీకి సేవలు అందించారు. దీంతో ఆయన 2014లో భూపాలపల్లి నియోజకవర్గం ( Bhupalapally ) నుండి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో స్పీకర్‌గా అవకాశం దక్కింది. అయితే 2018 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి ( Gandra venkataramanareddy ) గెలుపొందారు. ఇక ఆయనకు అప్పటి నుండి ఎమ్మెల్సీగా అవకాశం లేదా, రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగినా.. ప్రస్తుతం హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలతో పాటు సామాజిక వర్గాల ప్రాధాన్యం మేరకు..మూడు సంవత్సరాల తర్వాత మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు సీఎం కేసిఆర్.

  Crime News: ప్రియుడి ఇంటి ఎదుట ఈమె ఏం చేసిందో తెలుసా.. అనుకున్నది ఒకటి అయితే.. జరిగింది మరొకటి..

  మండలి చైర్మణ్‌గా అవకాశం..?

  మరోవైపు మధుసూదనాచారి పేరును మండలి చైర్మన్‌గా కూడా ప్రతిపాదనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో స్పీకర్ గా చేసిన అనుభవం ఉండడంతో పాటు సీఎం కేసిఆర్‌కు సన్నిహితంగా నేతల్లో ఆయన ఒకరు. అయితే మండలి చైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి విముఖంగా ఉన్న నేపథ్యంలోనే మధుసూదనా చారి పేరు తెరమీదకు వచ్చింది. గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఆయన్ను కేబినెట్‌లో తీసుకుంటే మధుసూదనాచారీకి మండలి చైర్మన్‌ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  First published:

  Tags: Governor Tamilisai, Telangana

  ఉత్తమ కథలు