Home /News /telangana /

Nizamabad : గుంపుమంటున్న గంజాయి సాగు.. పోలీసుల దాడులతో వెలుగు

Nizamabad : గుంపుమంటున్న గంజాయి సాగు.. పోలీసుల దాడులతో వెలుగు

Nizamabad : గుంపుమంటున్న గంజాయి సాగు.. పోలీసుల దాడులతో వెలుగు

Nizamabad : గుంపుమంటున్న గంజాయి సాగు.. పోలీసుల దాడులతో వెలుగు

Nizamabad : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి గంజాయి సాగు గుప్పుమంటుందా.. గంజాయి సాగుపై ఉక్కపాదం మోపినా.. తిరిగి అదే దందాను రైతులు తిరిగి కొనసాగిస్తున్నారా.. అందుకే రాష్ట్రంలో సైతం గంజాయి సప్లై విపరీతంగా పెరిగిపోయిందా.. అంటే..అవుననే సమాధానమే వస్తుంది... రాష్ట్రంలో ఇటివల గంజాయి తోటల గు బాలింపులు బయటపడుతుండడంతో అనేక అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి.

ఇంకా చదవండి ...
  నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు ప్రతినిధి పి మ‌హేంద‌ర్
  సైదాబాద్ చిన్నారీపై (saidabd rape ) అత్యాచారం ,హత్య తర్వాత రాష్ట్ర ఎక్సైజ్ పోలీసులు గంజాయి స్మిగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఓవైపు పోలీసులు మరియు మరోవైపు ఎక్సైజ్ అధికారులు మత్త పదార్థాల సరఫరా, వాటి వినియోగంపై స్పెషల్ ఫోకస్ పెట్టడడంతో రాష్ట్రంలోని గంజాయితోపాటు ఇతర మత్తు పదార్థాల అక్రమ దందాలు (smuggling ) వెలుగు చూస్తున్నాయి. అయితే ముఖ్యంగా గతంలో విపరీతంగా పండించిన గంజాయి సాగు మరోసారి మారుమూల ప్రాంతాల్లో తిరిగి పండిస్తున్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇందుకు కారణం ఇటివల పోలీసుల తనిఖీల్లో గంజాయిసాగు బయటపడడమేనని చెప్పవచ్చు..

  ఒకప్పుడు నిజామాబాద్‌ (nizamabad )జిల్లాలోని కొన్ని ప్రాంతాలు గంజాయికి అడ్డాగా ఉండేవి... పోలీసు, ఎక్సైజ్ శాఖ వారు ఉక్కుపాదంతో ఆణిచివేశారు.. అయితే.. తిరిగి ఆ ప్రాంతం గంజాయికి ఆడ్డ‌గా మారుతుందా అనే అనుమానాలు ( Doubts ) వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లా (kamareddy ) గాంధారి మండలం లో గంజాయి సాగు చేస్తున్న రైతులు పట్టుబడ్డారు.

  ఇది చదవండి :  హుజూరాబాద్‌లో హోరెత్తనున్న ప్రచారం.. ఇదిగో ప్రచారాన్ని నిర్వహించేది వీరే.. !

  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గాంధారి మండల కేంద్రంలోని కొత్త బాధి తండా పక్కనే ఉన్న పంట చేను లో గంజాయి సాగవుతుంద‌ని స‌మాచారం అందుకున్న ఎల్లారెడ్డి ఎక్సైజ్ సిఐ జాన్ రెడ్డి, గాంధారి పోలీసులు బృందాలు కలిసి దాడి చేశారు.. ఒక ఎకరా విస్తీర్ణంలో గంజాయి చెట్లను పెంచినట్లు గుర్తించారు.. ఎకరం మక్కజొన్న తోటలో వెయ్యి గంజాయి మొక్కలను గుర్తించి వాటిని ధ్వంసం చేశారు.. వేయి మొక్కలు స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు.. తాసిల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించి ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసారు..

  ఇది చదవండి :  ప్రేమన్నాడు.. లొంగకపోతే రికార్డులు బయటపెడతానన్నాడు.. చివరకు ఆ యువతి... ?

  మూడు రోజుల క్రితం కూడా ఇదే మండల కేంద్రంలోని కాయితి తండా గ్రామపంచాయతీ పరిధిలోని.. ధన్ సింగ్ తండా లోని రతన్ సింగ్ అనే వ్యక్తి వ్యవసాయ భూమిలో మొక్కజొన్న, కంది చెనులో అంతర్గత పంటగా గంజాయి సాగు చేస్తున్న విషయం తెలుసుకున్న కామారెడ్డి అధికారులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.. రతన్ సింగ్ అనే రైతు సాగు భూమిలో 267 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.

  స్థానికంగా రైతులు గంజాయి పండించడంతో.. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో యువ‌త గంజాయికి బానిసాలుగా మారుతున్నారు.. ఒకప్పుడు ప‌ట్ట‌ణాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన గంజాయి ఇప్పుడు గ్రామాస్థాయికి వెల్లినట్టు అధికారులు చెబుతున్నారు.. యువ‌త‌, స్కూల్ పిల్ల‌లు సైతం గంజాయికి బానిస‌లుగా మారుతున్నట్టు వార్తలు ( news ) వెలువడుతున్నాయి.. దీంతో పోలీసు శాఖ మ‌రింత నిఘ పెట్టి గంజాయి దందాకు అడ్డుక‌ట్ట వేయాని నిర్ణయించింది.

  ముఖ్యంగా గందారి మండలం పూర్తిగా ఆటవి,(forest ) గుట్ట‌లు క‌లిసి ఉంటుంది.. మ‌రో వైపు ఈ ప్రాంతంలో ఎక్కువ‌గా గిరిజ‌నులు నివాసం ఉంటారు.. దీంతో ఈ ప్రాంతంలో పంట పోలాల్లో ఆంత‌ర్ ప‌ంటగా గంజాయిని సాగు చేస్తున్నట్టు తెలుస్తోంది... ఇప్ప‌టికే ఇద్ద‌రి పంట పోలాల్లోగంజాయి సాగును గుర్తించిన ఎక్సైజ్, ఆబ్కారీ, శాఖలు గంజాయిని ద్వ‌సం చేసారు.. బాద్యుల‌పై కేసులు న‌మోదు చేసారు.. అయితే గ‌తంలో ఈ ప్రాంతం గంజాయికి అడ్డ‌గా ఉండేది.. మ‌రో సారి అడ్డ‌గా మారుతుందా అనే అనేమానం వ్య‌క్తం మ‌వుతుంది.. దీంతో గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు కోరుతున్నారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Nizamabad District, Nizamabad police

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు