GANJA SMUGLING GANG ARREST AND 2 CRORES GANJA SEIZED BY HYDERABAD POLICE VRY
Hyderabad : అల్లం పేరుతో గంజాయి.. కిలో అక్కడ 3 వేలు ఇక్కడ 20 వేలు...
ప్రతీకాత్మక చిత్రం
Hyderabad : హైదరాబాద్ నగర పోలీసులు మరో గంజాయి ముఠాను పట్టుకున్నారు.. నగరంలో సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్న సుమారు 800 కిలోల గంజాయితో పాటు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.
హైదారాబాద్ నగరంలో చాలా రోజుల తర్వాత మరోసారి గంజాయి స్మగ్లర్స్ ముఠా పట్టుపడింది. సైదాబాద్ సంఘటన తర్వాత గంజాయి రవాణపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు ప్రత్యేక నిఘాతో గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే నేడు తాజాగా వివిధ రాష్ట్రాలకు చెంది మరో ఆరుగురు సభ్యులు గల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 1.80 కోట్ల విలువ చేసే 800 కిలోల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది స్మగ్లర్లు ఒక ముఠాగా ఏర్పడి.. ఒడిశాలోని కొరపుట్ నుంచి మహారాష్ట్రలోని నాసిక్ కు గంజాయిని తరలిస్తున్నారు. అల్లం రవాణా మాటున నిందితులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. ఈమేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిపెన్ రవీంద్ర శుక్రవారం నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు.
సులభంగా డబ్బు సంపాదించేందుకు నిందితులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వీరు ఒక కేజీ గంజాయిని రూ.3 వేలకు కొనుగోలు చేసి రూ.20 వేలకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఠాలో ప్రధాన నిందితుడు వికాస్ జాధవ్ ఈ అక్రమ దందాకు లీడర్ గా వ్యవహరిస్తున్నాడని, పరారీలో ఉన్న అతన్ని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
కాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2021 మరియు 2022 జనవరి 20వ తేదీ వరకు మొత్తం 222 డ్రగ్స్ కేసులు నమోదు చేసి 459 మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నిత్యం డ్రగ్స్ దందా చేస్తున్న 25 మందిపై పిడి యాక్ట్ నమోదు చేసినట్టు చెప్పారు.. ఈమొత్తం కేసులకు సంబందించి నిందితుల నుంచి.. గంజాయి 2863.09 కిలోలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. కాగా ఇటివల అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు చెందిన కీలక సూత్రదారుడు టోనిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.