హోమ్ /వార్తలు /తెలంగాణ /

Adilabad : అంతరపంటగా గంజాయి .. ఆదిలాబాద్‌లో విచ్చలవిడిగా.. సాగు...

Adilabad : అంతరపంటగా గంజాయి .. ఆదిలాబాద్‌లో విచ్చలవిడిగా.. సాగు...

Adilabad : అంతర్‌పంటగా గంజాయి .. ఆదిలాబాద్‌లో విచ్చలవిడిగా.. సాగు...

Adilabad : అంతర్‌పంటగా గంజాయి .. ఆదిలాబాద్‌లో విచ్చలవిడిగా.. సాగు...

adialabad : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి గంజాయి సాగు గుప్పుమంటుందా.. గంజాయి సాగుపై ఉక్కపాదం మోపినా.. తిరిగి అదే దందాను రైతులు తిరిగి కొనసాగిస్తున్నారా.. అందుకే రాష్ట్రంలో సైతం గంజాయి సప్లై విపరీతంగా పెరిగిపోయిందా... రాష్ట్రంలో ఇటివల గంజాయి తోటల గుబాలింపులు, బయటపడుతుండడంతో అనేక అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి..

ఇంకా చదవండి ...

  Lenin ,News 18 ,Adilabad

  lఉమ్మడి ఆదిలాబాద్ (adilabad ) జిల్లాలోని మారుమూల గ్రామాల్లో నిషేధిత గంజాయి సాగు విచ్చల విడిగా సాగుతోంది. పత్తి, కంది వంటి పంటల్లో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు. మారుమూల గిరిజన గ్రామాల రైతుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని కొందరు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న స్మగ్లర్లు లబ్దిపొందుతున్నారు. అటు పోలీసులు కూడా నిఘాను పెంచి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, బజార్ హత్నూర్, గుడిహత్నూర్ మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో రైతులు సాగుచేస్తున్న వివిధ పంటల్లో అంతర పంటగా ఈ గంజాయిని సాగు చేస్తున్నారు.

  ఇటీవల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల ఎక్సైజ్ (excise ) అధికారులు దాడులు నిర్వహించి గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న గంజాయి సాగు వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. తాజాగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని చింతకర్ర గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ నాయక్ తాండ శివారులోని రైతు తిరుపతి తన చేనులో సాగుచేస్తున్న పత్తిపంటలో గంజాయిని అంతర పంటగా సాగుచేస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సుమారు 300 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. ఈ మేరకు కేసు కూడా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

  ఇది చదవండి :  నామినేషన్‌కు.. డబుల్ డోసు పడాల్సిందే.. కోవిడ్ నిబంధనలతో అభ్యర్థులు వెనక్కి

  మారుమూల ప్రాంతాల్లో సాగుచేస్తున్న గంజాయిని మహారాష్ట్రలోని ముంబాయి, నాగపూర్, పూనే, ఢిల్లి, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అమాయక రైతుల నుండి కిలో ఐదు వేల రూపాయలకు తీసుకొని ఇతర ప్రాంతాలకు పది వేల రూపాయల చొప్పున విక్రయించి లబ్దిపొందుతున్నరనే అభిప్రాయాలు ఉన్నాయి.

  ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ఉమ్రి(బి) పంచాయతీ పరిధిలో పత్తి పంటలో కందితోపాటు సాగు చేస్తున్న 70 గంజాయి మొక్కలను స్పెషల్ బ్రాంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని కాల్చి వేశారు. బాధ్యులపై కేసు కూడా నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మావల శివారులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయిని రవాణా చేస్తున్న ఐదుగురు పట్టుబడ్డారు. అనుమానాస్పదంగా మావల నుండి ఆదిలాబాద్ వైపు వచ్చిన ఆటోను తనిఖీ చేసి, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు నిందితులను విచారించగా గంజాయి విక్రయం వ్యవహారం బయటపడింది.

  ఇది చదవండి :  ప్రేమన్నాడు.. లొంగకపోతే రికార్డులు బయటపెడతానన్నాడు.. చివరకు ఆ యువతి... ?

  నిందితులు తమ జేబుల్లో గంజాయి ప్యాకెట్లను (ganja pockets ) దాచుకొని ఆదిలాబాద్ లో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరి నుండి కిలోన్నర గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 4500 రూపాయలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. అయితే అడపాదడపా పోలీసులకు అందిన సమాచారం మేరకు, వాహనాల తనిఖీల్లో ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయితే పోలీసులు నిఘాను మరింత పటిష్టం చేసి మారుమూల ప్రాంతాలపై దృష్టి పెడితే గంజాయిని కట్టడి చేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  సైదాబాద్ చిన్నారీపై (saidabd rape ) అత్యాచారం ,హత్య తర్వాత రాష్ట్ర ఎక్సైజ్ పోలీసులు గంజాయి స్మిగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఓవైపు పోలీసులు మరియు మరోవైపు ఎక్సైజ్ అధికారులు మత్త పదార్థాల సరఫరా, వాటి వినియోగంపై స్పెషల్ ఫోకస్ పెట్టడడంతో రాష్ట్రంలోని గంజాయితోపాటు ఇతర మత్తు పదార్థాల అక్రమ దందాలు (smuggling ) వెలుగు చూస్తున్నాయి.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Adilabad, Crime news, Telangana News

  ఉత్తమ కథలు