తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar)ను బురిడీ కొట్టించేందుకు కొందరు కేటుగాళ్లు ప్రయత్నించారు. భారీగా డబ్బులు లాగేందుకు స్కెచ్ వేశారు. ఈడీ పేరిట గంగుల కమలాకర్‌కు నోటీసులు పంపిన దుండగులు.. అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐతే వారు పంపించిన నోటీసులు, ఫోన్ కాల్ సంభాషణపై గంగుల కమలాకర్‌కు అనుమానం వచ్చి.. ఎన్‌ఫోర్స్‌మెండ్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కార్యాలయాన్ని సంప్రదించారు. ఐతే తాము ఎలాంటి నోటీసులు పంపలేదని ఈడీ అధికారులు చెప్పడంతో మంత్రి షాకయ్యారు. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని ఈడీ సీరియస్‌గా తీసుకుంది. మంత్రి గంగుల కమలాకర్‌కు నకిలీ నోటీసులు పంపిన వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసుల (Cyber Crime Police)కు ఈడీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ కేటుగాళ్లను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.
ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌కు చెందిన గ్రానైడ్ కంపెనీకి ఈడీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. గంగుల కమలార్‌కు చెందిన శ్వేత ఏజెన్సీతో పాటు మరో 8 కంపెనీలకు నోటీసులు వెళ్లాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత కొంతకాలం నుంచి గ్రానైట్ తవ్వకాలు కొనసాగుతున్నాయి నాణ్యమైన గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈడీ రంగంలోకి దిగింది. తొమ్మిది మైనింగ్ క్వారీలకు నోటీసులు జారీ చేసింది. రూ.749 కోట్ల 60 లక్షల పైచిలుకు మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించింది.
దళితులకే కాదు.. బీసీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాలకూ బంధు పథకం.. సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
గతంలో కాకినాడ, కృష్ణపట్నం, వైజాగ్, చెన్నై పోర్ట్ ల వద్దకు వెళ్లి విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. అలాగే చెన్నై ఓడరేవు వద్దకు సైతం వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ క్రమంలో మైనింగ్ డిపార్ట్‌మెంట్‌లో చూపించిన సైజులకు వాస్తవంగా అక్కడ ఉన్న వాటికి సంబంధం లేదు. అనుమతి తీసుకున్న వాటి కంటే ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేస్తున్నారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సమగ్ర నివేదికను అందించారు. ఈ నేపథ్యంలోనే మైనింగ్ డిపార్ట్మెంట్ రికార్డుల్లో చూపించిన వాటికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాటికి పొంతన లేదని గ్రానైట్ ఎగుమతుల వివరాలను ఖచ్చితంగా చూపాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు సీనరేజ్ ఫీజు చెల్లించకుండా ఎగుమతి చేస్తున్నారని కేసులు కూడా నమోదు చేసింది. అయితే అప్పుడు సీనరేజ్ ఫీజును రూ.125 కోట్లుగా నిర్ణయించారు. అదికూడా చెల్లించకపోవడంతో సీనరేజి ఫీజుకు ఐదుకు ఐదు రెట్లు అపరాధ రుసుం చెల్లించాలని మొత్తం 749 కోట్లకు పైగా వ్యాపారులు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు.
Telangana: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ఉత్తర్వులు విడుదల.. పూర్తి వివరాలు
కరీంనగర్‌లోని శ్వేత ఏజెన్సీస్, ఏస్షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జెఎం బాక్సి అండ్ కంపెనీ, అరవింద్ గ్రానైట్, మైథిలి ఆదిత్య, కెవికేఏజేన్సీస్, సంధ్య తదితర క్వారీలు పన్నులు ఎగవేసారని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ తెలిపింది. ఆయా కంపెనీల నుంచి రూ.749.66 కోట్లను రికవరి చేయాలని ఆదేశాలు జారీచేసింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ చేసిన దుండగులు.. మంత్రి గంగుల కమలాకర్‌కు తాజాగా నకిలీ నోటీసులు పంపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CYBER CRIME, Enforcement Directorate, Gangula kamalakar, Karimnagar, Telangana