నయీంతో ఆ టీఆర్ఎస్ నేతలకు సంబంధాలు.. ఆర్టీఐతో వెలుగులోకి...

Nayeem Case | ఎన్‌కౌంటర్లో నయీం చనిపోయినప్పుడు పెద్ద ఎత్తున డబ్బు దొరికినట్టు ప్రచారం జరిగింది. కౌంటింగ్ మెషిన్లు తీసుకొచ్చి మరీ పోలీసులు ఆ డబ్బును లెక్కబెట్టినట్టు అప్పటి వీడియోలు చెబుతున్నాయి.

news18-telugu
Updated: August 1, 2019, 9:57 PM IST
నయీంతో ఆ టీఆర్ఎస్ నేతలకు సంబంధాలు.. ఆర్టీఐతో వెలుగులోకి...
గ్యాంగ్‌స్టర్ నయీమ్(ఫైల్ ఫోటో)
  • Share this:
గ్యాంగ్ స్టర్ నయీం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నయీం కేసుకు సంబంధించిన వివరాలు కావాలంటూ సమాచార హక్కు చట్టం కింద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దరఖాస్తు చేసుకుంది. దీంతో నయీం కేసు వివరాలను పోలీసు శాఖ వెల్లడించింది. ఆ ఆర్టీఐ నివేదిక ప్రకారం.. నయీం కేసులో 16 మంది టీఆర్ఎస్ లీడర్ల పేర్లు ఉన్నాయి. మరో 17 మంది పోలీసుల పేర్లు కూడా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య, పలువురు మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, అడిషనల్‌ ఎస్పీలు, శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌, అమరేందర్‌రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్, సాయి మనోహర్‌రావు, శ్రీనివాసరావు, ప్రకాశ్‌రావు, వెంకటనర్సయ్య పేర్లు ఉన్నాయి. అంతే కాదు.. ఈ కేసులో పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న, ఇన్‌స్పెక్టర్లు మస్తాన్‌, శ్రీనివాసరావు, మాజీద్‌, వెంకట్‌రెడ్డి, వెంకటసూర్యప్రకాశ్‌, రవికిరణ్‌రెడ్డి, బల్వంతయ్య, బాలయ్య, రవీందర్‌, నరేందర్‌గౌడ్‌, దినేష్‌, సాదిఖ్‌మియా పేర్లు కూడా ఉన్నట్లు ఆర్టీఐ తెలిపింది. మాజీ జెడ్పీటీసీ సుధాకర్‌, భువనగిరి కౌన్సిలర్‌ అబ్దుల్ నాజర్‌, మాజీ కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీలు నాగరాజు, వెంకటేష్‌ పేర్లు, మాజీ సర్పంచ్‌ పింగల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవ, వెల్దండ టీఆర్‌ఎస్‌ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య పేర్లు ఉన్నాయి.

ఎన్‌కౌంటర్లో నయీం చనిపోయినప్పుడు పెద్ద ఎత్తున డబ్బు దొరికినట్టు ప్రచారం జరిగింది. కౌంటింగ్ మెషిన్లు తీసుకొచ్చి మరీ పోలీసులు ఆ డబ్బును లెక్కబెట్టినట్టు అప్పటి వీడియోలు చెబుతున్నాయి. అయితే, నయీం డెన్‌లో కేవలం రూ2.08 కోట్ల నగదు, 1944 గ్రాముల బంగారం మాత్రమే దొరికినట్టు అధికారులు వెల్లడించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 1, 2019, 9:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading