హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG నయీం ఇంట్లో వేల కేజీల వెండి, బంగారం.. ఆర్టీఐ రిపోర్టులో సంచలన విషయం

OMG నయీం ఇంట్లో వేల కేజీల వెండి, బంగారం.. ఆర్టీఐ రిపోర్టులో సంచలన విషయం

గ్యాంగ్ స్టర్ నయీం (ఫైల్ ఫోటో)

గ్యాంగ్ స్టర్ నయీం (ఫైల్ ఫోటో)

Nayeem Dairy: నయీం ఇంట్లో దొరికిన వన్నీ ప్రస్తుతం కోర్టుకు సమర్పించామని, ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నందును తాము ఇంతకు మించిన వివరాలను ఇవ్వలేమంటూ ఆర్టీఐ దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో పోలీసులు పేర్కొన్నారు.

గ్యాంగ్ స్టర్ నయీం ఎన్‌కౌంటర్ తర్వాత అతడి వద్ద ఎంత ఆస్తులు లభించాయనే అంశంపై చాలా సందేహాలు ఉన్నాయి. ఎంత డబ్బు దొరికింది, ఏమేం పత్రాలు లభించాయనే దానికి సంబంధించి కూడా పలు అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలు అసలు గ్యాంగ్ స్టర్ నయీం ఇంట్లో ఎంత డబ్బు, బంగారం దొరికిందనే దానికి సంబంధించిన అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుతో ఈ విషయాలు వెలుగుచూశాయి. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున ఎం.పద్మనాభ రెడ్డి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు హైదరాబాద్ నార్త్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సమాధానం ఇచ్చారు. ఆ వివరాల ప్రకారం నయీం ఎన్ కౌంటర్ తర్వాత అతడి నివాసంలో వెతకగా, పోలీసులకు దొరికిన వస్తువులు, ఆస్తుల వివరాలు ఇవి.

నగదు రూ.21657180

బంగారం 1.944 కేజీలు

వెండి 2,482 కేజీలు

కార్లు 21

బైక్‌లు 26

సెల్ ఫోన్లు 60

లాండ్ డాక్యుమెంట్లు 752

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ 1

డైరీలు 130

దీంతో పాటు చాలా ఆయుధాలను కూడా గుర్తించారు. అందులో ఏకే 47 రైఫిల్స్ 3, పిస్టళ్లు 9, రివాల్వర్లు 3, తపంచాలు 7, ఎస్‌బీబీఎల్ 12 బోర్ గన్ 1, స్టెన్ గన్ 1, హ్యాండ్ గ్రెనేడ్స్ 2, జిలెటిన్ స్టిక్స్ 10, అమ్మోనియం నైట్రేట్ 5 కేజీలు, మేగజీన్స్ 6 రౌండ్లు, మొత్తం 616 రౌండ్ల బుల్లెట్స్, డిటొనేటర్లు 30 లభించాయి.

నయీం ఇంట్లో దొరికిన వస్తువుల జాబితా

ఇవన్నీ ప్రస్తుతం కోర్టుకు సమర్పించామని, ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నందును తాము ఇంతకు మించిన వివరాలను ఇవ్వలేమంటూ ఆర్టీఐ దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఆ లాండ్ డాక్యుమెంట్లు ఎవరివి?, ఆ డైరీల్లో ఏముందనే అంశాన్ని అందులో పొందుపరచలేదు.

మరోవైపు నయీమ్ కేసులో సమగ్ర విచారణ జరపాలని కోరుతూ తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్‌కు లేఖ రాశారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి. నయీం ఇంట్లో లభించిన వస్తువులకు సంబంధించిన వివరాలను అందులో పొందుపరిచిన ఆయన, ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలు లభించడం అంటే, నయీమ్‌కు టెర్రరిస్టులతో కూడా సంబంధాలు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నయీమ్ చనిపోయినా, అతడు స్థాపించిన సామ్రాజ్యం అలాగే ఉందని అభిప్రాయపడ్డారు. నయీమ్‌కు సహకరించిన పోలీసులు, రాజకీయ నాయకులు, రెవిన్యూ, ఇతర రిజిస్ట్రేషన్ శాఖల అధికారులపై సమగ్ర విచారణ జరిపించాలని, వారికి కూడా శిక్ష పడాలని అన్నారు. నయీమ్ ఇంట్లో దొరికిన 130 డైరీల్లో చాలా మంది పోలీసులు, రాజకీయ నేతల పేర్లు ఉండి ఉండొచ్చని, వాటిని సరిగా పరిశీలించకుండా న్యాయస్థానంలో డిపాజిట్ చేశారని పద్మనాభరెడ్డి ఆక్షేపించారు. ప్రస్తుతం సిట్ జరుపుతున్న విచారణ మందకొడిగా ఉందని, అలాగే పైపైన విచారణ జరుగుతోందని, లోతుగా విచారణ జరగడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సమగ్ర విచారణ జరపాలని గవర్నర్‌ను పద్మనాభరెడ్డి కోరారు.

First published:

Tags: Telangana Police

ఉత్తమ కథలు