Gangetic fish in Telangana: హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్శిటీ చాలా పెద్దది. అక్కడ చదువులే కాదు... పరిశోధనలూ చాలా లోతుగా జరుగుతాయి. వైవిధ్యబరితమైన చేపలపై తాజాగా పరిశోధనలు చేశారు. అప్పుడు కనిపించింది స్ప్రాట్ కొరికా సోబోర్నా (Sprat Corica soborna) చేప. ఇది మామూలు చేప కాదు. ఉత్తరాది రాష్ట్రాల్లో గంగానదిలో మాత్రమే ఇది కనిపిస్తుంది. అలాంటి చేప తొలిసారిగా దక్షిణాది రాష్ట్రాల జలాల్లో... అది కూడా తెలంగాణలో కనిపించింది. కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని తలాయ్ గ్రామంలోని ఓ కొండ నుంచి పారుతున్న నీటిలో ఈ చేప కనిపించింది. ఈ నీరు అలా పారుతూ... ప్రాణహిత నదిలో కలుస్తుంది. మరి ప్రాణహిత నది... గోదావరికి ఉపనది కాబట్టి... చివరకు ఆ నీరు గోదావరిలో కలుస్తుందని అనుకోవచ్చు.
ఇప్పటివరకూ ఈ చేప... ఉత్తరప్రదేశ్లోని గంగానది, దాని ఉపనదుల్లో మాత్రమే కనిపించింది. అటు తూర్పు వైపున బంగ్లాదేశ్లో కనిపిస్తుంది. ఈ చేప జాతికి చెందిన చేపలు ఓసారి... కేరళలోని పొనానీ జలాల్లో కనిపించాయి. ఇండియాతోపాటూ... ఇండొనేసియా, మలేసియా, సింగపూర్లో ఈ చేపలు కనిపించాయి.
ఈ చేపను ఉస్మానియా యూనివర్శిటీలోని... బయోడైవర్శిటీ అండ్ కన్సర్వేషన్ స్టడీస్ సెంటర్ లోని మహ్మద్ యూనస్, జువాలజీ విభాగంలోని కంటే కృష్ణ ప్రసాద్ సేకరించారు. ఇంటర్నేషనల్ రీసెర్చ్ జర్నలైన... త్రెటెన్డ్ టాక్సాలో ఈ చేప విశేషాల్ని తెలిపారు.
ఎలా వచ్చింది?
ఈ చేప ఆ కొండ జలాల్లోకి ఎలా వచ్చిందన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఎవరైనా పనిగట్టుకొని గంగానది నుంచి ఈ చేపను తెచ్చి... తెలంగాణలోని నీటిలో వేశారని అనుకోలేం. ఎందుకంటే... ఎవరూ అలాంటి పని చెయ్యడానికి ఆసక్తి చూపరు. పైగా ఇది అరుదైన చేప కాబట్టి... అంత రిస్క్ ఎవరు చేస్తారన్నది ప్రశ్న. ఇది జరగని పనిలా ఉంది కాబట్టి... ఆ కొండ జలాలకు గంగానది జలాలతో లింక్ ఉండి ఉంటుందనే కోణం కనిపిస్తోంది. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో గంగానదికీ, తెలంగాణలో జలాలకూ లింక్ ఉండటం అనేది ఆశ్చర్యకరవిషయమే. అలా ఉంటేనే ఈ చేప ఇక్కడకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏ లింకూ లేకుండా ఈ అరుదైన చేప రావడం సాధ్యం కాదంటున్నారు కొందరు. దీనిపై లోతైన సైంటిఫిక్ పరిశోధనలు జరపాల్సి ఉందని ఉస్మానియా యూనివర్శిటీ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కెల్మాల శ్రీనివాసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Immunity Power: వ్యాక్సిన్లతో ఇమ్యూనిటీ మంచిదేనా? పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
ఈ చేపతోపాటూ... బకాలూ ఫిష్ రిటా బకాలు (Bakalu fish Rita bakalu) చేప కూడా పరిశోధకులకు లభించింది. దాంతోపాటూ... మరికొన్ని స్థానికంగా కనిపించే జీవ రాశులు లభించాయి.
Published by:Krishna Kumar N
First published:December 28, 2020, 12:14 IST