Home /News /telangana /

GANG WAR BETWEEN FORMER MLA AND MP CADRE IN NIZAMABAD DISTRICT BJP MOREOVER ATTEMPT TO DOMINATE ONE CATEGORY OVER ANOTHER NZB PRV

Telangana BJP: బీజేపీలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎంపీ వర్గాల మధ్య గ్యాంగ్ వార్.. ఓ వర్గం పై మరో వర్గం ఆధిపత్యానికి యత్నం

నిజామాబాద్​ బీజేపీ నేతలు (ఫైల్ ఫొటో)

నిజామాబాద్​ బీజేపీ నేతలు (ఫైల్ ఫొటో)

ఆ జిల్లాలో అంతకముందు బీజేపీకి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఆయనొక్కరే. పీసీసీ అధ్యక్షుడినే ఓడించిన చరిత్ర ఆయనది. కానీ, ఇటీవల బీజేపీ అభ్యర్థి అదే జిల్లాలో ఎంపీగా ఎన్నికవడంతో క్యాడర్లో రెండు వర్గాలు అయ్యాయి. దీంతో రభస మొదలైంది.

  (న్యూస్18 తెలుగు ప్ర‌తినిధిః పి మ‌హేంద‌ర్)

  నిజామాబాద్ (Nizamabad) జిల్లా  భార‌తీయ జ‌న‌త పార్టీ (BJP)లో మాజీ ఎమ్మెల్యే యేండల లక్ష్మీనారాయణ (Former MLA Yendala Lakshminarayana), ఎంపీ అర్వింద్ (MP Arvind) ల మ‌ధ్య వ‌ర్గ పోరు సాగుతుంది. ఇకు వ‌ర్గాల‌ విభేదాలు రచ్చకెక్కాయి. ఓ వర్గానికి చెందిన బీజేవైఎం నేత పై కేసు నమోదు కావడంతోనే సస్పెన్షన్ వేటు పడింది. అరెస్టు కావడంతో విభేదాలు మ‌రింత ముదిరాయి. ఇటీవల మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యేండల లక్ష్మీనారాయణ చేసిన‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ నేత‌ల‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసి పార్టీ స‌ఖ్య‌త‌ను నాశనం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. దీంతో జిల్లాలో బ‌లంగా ఉన్న వ‌ర్గ‌పోరుతో పార్టీ ఏటు పోతుందోనని  పార్టీ శ్రేణులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

  నిజామాబాద్ జిల్లాలో భార‌తీయ జ‌న‌తా పార్టీ (BJP) అంటే మొద‌ట‌గా గుర్తుకు వ‌చ్చే పేరు యేండాల ల‌క్ష్మి నారాయణ.. జిల్లాలో బీజేపీ జెండా ఎగ‌రేసిన ఎమ్మెల్యే అయ‌నే. రెండు సార్లు పీసీసీ చీఫ్​ ధర్మ‌పూరి శ్రీనివాస్ పై విజ‌యం సాధించారు. దీంతో యేండాల అంటే ఢిల్లీ వ‌ర‌కు తెలిసింది. ఆయ‌న చెప్పిందే జిల్లాలో జ‌రిగేది.

  అయితే ప్రస్తుతం వ్యవహారం 2017 కు ముందు. త‌రువాత అన్నట్టుగా మారింది. భార‌తీయ జ‌న‌త పార్టీ రాజ‌కీయం. 2017లో ఎంపీ ధర్మ‌పురి ఆర్వింద్ (MP Dharmapuri Arvind) బీజేపీలో చేరిన నాటి నుంచి త‌న దైన శైలిలో పార్టీలో త‌న అధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. జిల్లా నుంచి ఢిల్లీ దాక త‌న ఉనికిని చాటుకున్నారు. ఆ నాటి నుంచి యేండాల‌, అర్వింద్ వ‌ర్గాలుగా క్యాడ‌ర్ విడిపోయింది. సీఎం కేసీఆర్ పై ఎంపీ అర్వింద్ త‌న దైన శైలిలో విరుచుపడుతూ ఉనికి చాటుకుంటున్నారు.

  ఎంపీ అర్వింద్ అంటే ఫైర్ బ్రాండ్​గా..

  జిల్లాలో ఎంపీ అర్వింద్ అంటే ఫైర్ బ్రాండ్​గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంపీ అర్వింద్ తో పాటు పార్టీలో చేరిన బ‌స్వా ల‌క్ష్మినారాయణ జిల్లా పార్టీ అధ్యక్షుడు అయ్యారు. జిల్లాలో ఎంపీ వ‌ర్గానిదే అధిపత్యం న‌డుస్తుంది. మ‌రో వైపు తన వ‌ర్గంపై బుర‌ద జ‌ల్లుతున్నార‌ని యేండ‌ల స్వ‌యంగా అంటున్నారు. పార్టీ కొసం ప‌నిచేస్తున్న వారిపై అక్ర‌మ కేసులు పెడుతున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

  తప్పుడు కేసులు నమోదు చేసి..

  గ‌త మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీ ఫాం లు ఇవ్వ‌కుండా అమ్ముకున్న వారే ఇలాంటి ప‌నులు చేస్తున్నార‌ని యేండాల మండిప‌డ్డారు. బీజేవైఎం ప్ర‌ధాన కార్యద‌ర్శి పటేల్ ప్ర‌సాద్ పై ఫిర్యాదు చేయించారని ఆరోపణలు చేశారు. సదరు మహిళ వద్ద ఎటువంటి ఆధారాలు లేకుండా త‌ప్పుడు కేసు పెట్టించార‌ని ఆరోపించారు. తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తున్న వారిపై కోర్టుకు ఈడుస్తామని హెచ్చరించారు.

  ఈ వ్యాఖ్యలు బీజేపీలో దుమారం రేపుతున్నాయి. బీజేపీ నేత ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయాల్సింది పోయి సొంత పార్టీ నాయకులకు పై ఆరోప‌ణ‌లు చేయడం వెనుక పార్టీలో ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరినట్టు క‌నిపిస్తుంది.  ఈ మ‌ధ్య బీజేవైఎం లో జరిగిన నియామకాలు కొన్ని రాత్రికి రాత్రే రద్దయ్యాయి.  అందుకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పటేల్ ప్రసాద్ అని చర్చ జరుగుతోంది.

  ఇటీవల బీజేపీ చేపట్టిన సభ్యత్వ నమోదులో చురుగ్గా ఉండి. అత్యధికంగా సభ్యత్వాలు చేయించారు. దీంతో ప్ర‌సాద్ కు రాష్ట్ర ప్ర‌దాన కార్య‌ద‌ర్శి హోదా బాధ్యతను అప్పగించారు.  ప‌టేల్ ప్రసాద్ యేండల లక్ష్మీనారాయణ ప్రధాన అనుచ‌రుడు. దీంతో మరో వర్గానికి మింగుడు పడడం లేదని విమర్శలు అంత కోడైకూస్తున్నాయి.

  పటేల్ ప్రసాద్ జనాధరణ..

  ఇటీవల జిల్లా కలెక్టరేట్ వద్ద రెండు వ‌ర్గాల మ‌ద్య జరిగిన వాగ్వాదం స‌మ‌సిపోయింది.  జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలో దేవాలయ భూముల పరిరక్షణ పేరుతో చేపట్టిన ఆందోళ‌న‌లు బీజేపీలో కొత్త చర్చకు దారితీసింది. పార్టీ నుంచి ఎటువంటి ఆదేశాలు లేకుండా చేపట్టిన ఆందోళన పటేల్ ప్రసాద్ జనాధరణను పెంచింది. దీంతో భూముల అక్రమాలపై ఆల‌య ర‌క్ష‌ణ కోసం చేసిన ర్యాలీలో పెద్దఎత్తున హిందువులు తరలివచ్చారు. దీంతో పటేల్ ప్రసాద్ మరో వర్గానికి న‌చ్చ‌లేదు.

  పార్టీ నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు..

  ఇటీవల ప్ర‌సాద్ పై ఓ పోలీసు కేసు నమోదయ్యింది. ఆ ఫిర్యాదుపై గంటల వ్యవధిలో ఎఫ్ఐఆర్ నమోదు కాగ‌నే  పార్టీ నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు రావడం కలకలం రేపింది.  పార్టీలో జరుగుతున్న దుందుడుకు చర్యలు. పార్టీ నిర్ణయాలు ఎటుపోతున్నాయని చ‌ర్చ జ‌రుగుతోంది. చివ‌ర‌కు ప‌టేల్ ప్రసాద్ పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను కోర్టు కోట్టివేసింది. బ‌య‌టకు వ‌చ్చిన ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  అయితే రాష్ట్రంలో బీజేపీ పాగా వేయడం సంగ‌తి అటుంచితే. జిల్లాలో బీజేపీ వ‌ర్గ‌పోరు ఏటు దారితీస్తుందో ఆనే చ‌ర్య పార్టీ శ్రేణులో క‌నిపిస్తుంది.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bjp, Dharmapuri aravind, Nizamabad, Telangana bjp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు