Home /News /telangana /

Hyderbad crime : పూజలు చేస్తే డబ్బు రాలేదని.. ఏకంగా పూజారినే తుపాకితో బెదిరించి డబ్బులు గుంజారు...!

Hyderbad crime : పూజలు చేస్తే డబ్బు రాలేదని.. ఏకంగా పూజారినే తుపాకితో బెదిరించి డబ్బులు గుంజారు...!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderbad crime : హైదరాబాద్ ( HYDERBAD )నగరంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.. డబ్బుల కోసం పూజారి చేత పూజలు చేయించుకున్న వ్యక్తి ఎంతకి డబ్బులు రాకపోవడంతో పూజారికి ఇచ్చిన డబ్బులతోపాటు పూజకు ఖర్చు అయిన మొత్తం రూపాయలను వసూలు చేసుకునేందుకు తుపాకి పట్టుకుని బెదిరించాడు.

ఇంకా చదవండి ...
    కష్టపడేవారికి డబ్బు సంపాదించేందుకు అనేక వక్రమార్గాలు ఉన్నాయి.. అయితే ఇలా ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుని ఈజీ మనికి అలవాటు పడిన వారు కొందరు ఉంటారు. ఇలా వారి అత్యాశను క్యాష్ చేసుకునే వారు కూడా ఉంటారు. అయితే ఇలా ఈజీ మనికి అలవాటు పడిన ఓ వ్యక్తి తన ఇంట్లో పూజలు చేయించుకోవడం ద్వారా డబ్బు వస్తుందని భావించాడు.. దీంతో ఓ పూజారికి మూడు లక్షలు ఇచ్చి ఇంట్లో మూడు నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయించాడు... అయినా డబ్బులు రాకపోవడంతో.. ఆ పూజారినే తుపాకి బెదిరించి తనకు ఇచ్చిన డబ్బులను తీసుకునే ప్రయత్నం చేసి చివరకు కటకటాలపాలు అయ్యాడు.

    వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ (Gang threaten with gun) భరత్‌నగర్‌కు చెందిన నాగేశ్వరరావు తన నివాసంలో పూజలు చేస్తే ధనవంతుడిని అవుతానని భావించాడు. ఇందుకోసం గుంటూరు జిల్లా దుర్గికి చెందిన పురుషోత్తమాచార్యులు అనే పూజారిని గతనెల 22న పూజల కోసం హైదరాబాద్‌‌కు రప్పించాడు.

    ఇది చదవండి  : నన్ను ఎందుకు పిలవలేదు..? ఏఐసీసీకి లేఖ రాసిన జగ్గారెడ్డి..


    కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పురుషోత్తమాచార్యులతో .. నాగేశ్వరరావు రెండ్రోజుల పాటు పూజలు చేయించుకున్నాడు. పూజలు పూర్తయినప్పటికీ తనకు డబ్బులు రాకపోవడంతో ఆగ్రహం చెందిన నాగేశ్వరరావు అతని అనుచరుడు రామారావు, పటేల్‌తో పాటు మరో ఐదుగురితో కలిసి పూజారిపై దాడి చేసి తుపాకులతో బెదిరించారు. పూజల కోసం ఖర్చు చసిన రూ.3లక్షలు ఇవ్వాలని పూజారిని బెదిరించారు.

    ఇది చదవండి : వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటి..


    అయితే పూజల కోసం ఖర్చు చేసిన డబ్బులు తిరిగి తననే ఇవ్వమని చెప్పడంతోపాటు పూజారిని తుపాకితో బెదిరించడంతో ఆందోళన చెందిన పూజారి పురుషోత్తమాచార్యులు .. నాగేశ్వరరావు ముఠాకు రూ.45వేలు రెండు విడతలుగా ఇచ్చారు. (Gang threaten with gun )అయితే.. మిగిలిన డబ్బుల కోసం మళ్లీ బెదిరించారు. దీంతో తన డబ్బు లేకపోవడతో చివరకు పూజారి పోలీసులను ఆశ్రయించారు. నిందితుల నుంచి రెండు తుపాకులు, ఏడు చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    ఇది చదవండి : నిర్మల్‌లో బోర్డు తిప్పిన ముద్ర ఫైనాన్స్ .. స్థానికుల ఆందోళణ..


    మొత్తం మీద ఈ సంఘటన సినమాలోని ఓ సీన్‌ను తలపించేదిగా కనిపిస్తోంది. సినిమాల్లో ిఇలాగే పూజారీ చెప్పినట్టు జరగలేదని వారిని బంధించడం ..  ఆతర్వాత వారి లక్ష్యం నెరవేరే వరకు వారి అదుపులోనే ఉండడం లాంటి సన్నివేశాలు గుర్తుకువస్తున్నాయి. ఏది ఏమైనా డబ్బులు అతి ఈజిగా సంపాదించాలనే అత్యశ ఉన్నవారు ఇలా పూజలతో పాటు వక్రమార్గాలు పట్టడడం నిజంగా అశ్చర్యకరమే..

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Hyderabad

    తదుపరి వార్తలు