• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • GANG OF THIEVES GOLD SHOP ROBBERY PLAN FAILED LEADS TO ATM MACHINE STOLEN IN ADILABAD HSN

Adilabad: బంగారం దుకాణంలో భారీ చోరీకి ప్లాన్.. కథ అడ్డం తిరగడంతో ఏటీఎం మెషీన్ నే ఎత్తుకెళ్లారు..!

Adilabad: బంగారం దుకాణంలో భారీ చోరీకి ప్లాన్.. కథ అడ్డం తిరగడంతో ఏటీఎం మెషీన్ నే ఎత్తుకెళ్లారు..!

ప్రతీకాత్మక చిత్రం

బంగారం దుకాణంలో చోరీ చేయాలనున్నారు. కానీ ఆ దొంగల ప్లాన్ బెడిసికొట్టింది. ఉత్త చేతులతో వెళ్లకూడదనుకున్నారో ఏమో కానీ వాళ్లు ఏకంగా ఓ ఏటీఎం సెంటర్లో చోరీకి సిద్ధమయ్యారు. ఏకంగా ఏటీఎం మెషీన్ నే ఎత్తుకెళ్లారు. అసలేం జరిగిందంటే..

  • Share this:
    ఓ దొంగల ముఠా. పక్కా స్కెచ్ తో ఓ బంగారం దుకాణంలో చోరీ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. అర్ధరాత్రి ఆ బంగారం దుకాణానికి చేరుకున్నారు. కానీ వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఆ బంగారం దుకాణంలో చోరీ చేయడానికి ఆ దొంగల గ్యాంగ్ కు వీలు కుదరలేదు. ఎంతో కష్టపడి చాలా రోజుల పాటు స్కెచ్ గీస్తే చివరకు ఇలా అయిందేంటబ్బా అని వారిలో ప్రస్టేషన్ పెరిగిపోయింది. ఉత్త చేతులతో వెనక్కి వెళ్లకూడదని అనుకున్నారో ఏమో కానీ, ఆ బంగారం దుకాణానికి దగ్గరలోనే ఉన్న ఏటీఎం సెంటర్ పై వారి కన్ను పడింది. మామూలుగా అయితే ఏటీఎం బాక్సును బద్దలు కొట్టి డబ్బును చోరీ చేసే దొంగలు చాలా మందే ఉంటారు. కానీ ఈ గ్యాంగ్ మాత్రం వెరైటీ. ఏకంగా ఏటీఎం మెషీన్ నే ఎత్తుకెళ్లారు. అదిలాబాద్ లో కలకలం రేపుతున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    అదిలాబాద్ నగరంలో సోనార్ బజార్ ప్రాంతంలో వైష్ణవీ జ్యువెలరీ అనే బంగారు దుకాణం ఉంది. భారీ స్థాయిలో కస్టమర్లు రోజూ ఆ షాపునకు వస్తుంటారు. దీంతో ఈ జ్యువెలరీపై ఓ దొంగల ముఠా కన్నుపడింది. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆ బంగారం షాపు వద్దకు ఓ వ్యాన్ లో దొంగల ముఠా చేరుకుంది. అయితే ఏ కారణం వల్లనో ఏమో కానీ, ఆ బంగారం దుకాణంలో చోరీ చేయడానికి వారికి వీలు కుదరలేదు. దీంతో వారి కన్ను కలెక్టర్ చౌరస్తాలోని ఏటీఎం పై పడింది.

    దొంగలు ఆ ఏటీఎం సెంటర్ వద్దకు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చేరుకున్నారు. ఏకంగా ఏటీఎం మెషీన్ నే పెకలించుకుని తాళ్లతో కట్టుకుని వ్యాన్ లో వేసుకుని వెళ్లారు. కాస్త దూరం వెళ్లాక క్యాష్ బాక్స్ ను బద్దలు కొట్టి, నగదును తీసుకున్నారు. ఆ ఏటీఎం మెషీన్ ను సావర్గమ్ ప్రాంతంలో పడేశారు. తెల్లవారిన తర్వాత కానీ, ఏటీఎం మెషీన్ చోరీ వ్యవహారాన్ని ఎవరూ గుర్తించలేదు. ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందడంతో, ఏటీఎంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అంతర్రాష్ట్ర దొంగల పనే అయి ఉంటుందన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అదిలాబాద్ పోలీసులు వెల్లడించారు.
    Published by:Hasaan Kandula
    First published: