Home /News /telangana /

GANESH WHO COMES FROM A POOR FAMILY IN MEDAK AND HAS BEEN WINNING MEDALS IN KICK BOXING MDK PRV

Kick Boxing: వచ్చిందేమే నిరుపేద కుటుంబం నుంచి.. అయితేనేం.. కిక్​ బాక్సింగ్​లో దుమ్మురేపుతున్న యువకుడు

గణేశ్​

గణేశ్​

ఎన్ని అడ్డంకులు వచ్చినా తమ లక్ష్యం సాధనను మాత్రం మరువలేదు. ఎంతో శ్రమించి అనుకున్నది సాధించి తానేంటో విజయాల ద్వారా చూపించాడు. ప్రతిభకు పేదరికం  అడ్డు కాదని నిరూపించారు.

    నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి  చిన్నతనం నుంచే కష్టాల ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తమ లక్ష్యం సాధనను మాత్రం మరువలేదు. ఎంతో శ్రమించి అనుకున్నది సాధించి తానేంటో విజయాల ద్వారా చూపించాడు. ప్రతిభకు పేదరికం  అడ్డు కాదని నిరూపించారు. ఉమ్మడి మెదక్  Medak) జిల్లాకు చెందిన యువకుడు. తమకిష్టమైన రంగంలో అడుగుపెట్టి కష్టపడి సాధన చేసి పతకాలు సాధించాడు  ఇటీవల పలు రాష్ట్రాలలో జరిగిన పోటీలలో కిక్ బాక్సింగ్ (Kick boxing) విజేతగా నిలిచాడు. అతడు పంచ్ కొడితే విజయం ఖాయం. అతడే  మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన ఎంబరి గణేశ్ (Ganesh).

    వారసత్వంగా వచ్చిన రెండెకరాలే ఆధారం..

    బక్కపలుచగా కనిపించే ఈ 28 ఏళ్ల యువకుడు బరిలోకి దిగితే సింహంలా ప్రత్యర్థిపై దూకి పంచ్ లు విసురుతారు. తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, యాదయ్య. వీరికి కుమారుడు గణేశ్, కుమార్తె రజితలు ఉన్నారు. వారసత్వంగా వచ్చిన రెండెకరాలే ఆధారం. గణేశ్. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూనే చెట్లు మట్టి దిబ్బలను ఆధారంగా చేసుకొని సాధన చేయడం గమనార్హం. బీఫార్మసీ పూర్తి చేశాడు గణేశ్​. కష్టాలకు ఎదురు నిలుస్తూ దాతల సహకారంతో పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నాడు.

    దిల్లీ సిక్కిం హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ మేఘాలయ రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. కోల్ కతాలో జరిగిన పోటీలకు వెళ్లి ఛాంపియన్షిప్ సాధించాడు కూడా. 2019 కొరియాలో జరిగిన అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించగా ఆర్థిక ఇబ్బందులతో వెళ్లలేకపోయాడు.

    ganesh


    విజయ్ దేవరకొండ సాయంతో..

    2020లో సినీ నటుడు విజయ్ దేవరకొండ సహకారంతో దిల్లీలో జరిగిన పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకం సాధించాడు. గతేడాది గోవాలో జరిగిన పోటీలకు వెళ్లి బహుమతి అందుకున్నాడు. నర్సాపూర్ కౌన్సిలర్ లత, రమేశ్​ యాదవ్​ దంపతుల సాయంతో ఇటీవల హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఉత్తమ ఫైటర్ అవార్డు సైతం సాధించారు. ఈ నెల 3 నుంచి విశాఖపట్టణంలో జరగనున్న పోటీలకు సన్నద్ధమయ్యాడు మన గణేశ్​.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Boxing, Medak

    తదుపరి వార్తలు