హైదరాబాద్‌లో కొనసాగుతున్న నిమజ్జనం... సిటీలో ట్రాఫిక్ జామ్స్

Ganesh immersion 2019 : హైదరాబాద్‌లో బొజ్జ వినాయకుడి నిమజ్జనం గురువారం అర్థరాత్రి తర్వాత కూడా సాగింది. ఇప్పటికీ విగ్రహాలు తరలివస్తుండటంతో... హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: September 13, 2019, 11:35 AM IST
హైదరాబాద్‌లో కొనసాగుతున్న నిమజ్జనం... సిటీలో ట్రాఫిక్ జామ్స్
గంగమ్మ ఒడిలో ఖైరతాబాద్ గణేశుడు
  • Share this:
Ganesh immersion 2019 :  ఈసారి హైదరాబాద్‌లో నిమజ్జనం అంచనాలు తప్పినట్లు కనిపిస్తున్నాయి. రాత్రికల్లా అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తైపోవాలని అధికారులు అంచనా వేసుకున్నా... చిత్రంగా ఇవాళ కూడా మరో 500 విగ్రహాల్ని ఇంకా నిమజ్జనం చెయ్యాల్సి ఉంది. ఫలితంగా ట్యాంక్‌బండ్‌పై భారీ వాహనాలు వరుసగా వచ్చి ఉన్నాయి. సిటీ నలుమూలల నుంచీ వాహనాలు వస్తూనే ఉన్నాయి. ఫలితంగా అక్కడక్కడా ట్రాఫిక్ జామ్స్ తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ట్యాంక్‌బండ్‌ దగ్గర 20 వేలకుపైగా విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం మొదలైన నిమజ్జన ప్రక్రియ రోజంతా సాగింది. ఖైరతాబాద్ ద్వాదశ ఆదిత్య మహా గణపతిని క్రేన్ నంబర్ 6 దగ్గర పూజలు చేసి గంగమ్మ ఒడికి సాగనంపారు. రాత్రి వేళలో పెద్ద వాహనాలపై ధూంధాం డప్పు చప్పుళ్లు, హోరెత్తే నినాదాల మధ్య గణనాథులు తరలివచ్చారు. నగర వీధులన్నీ వినాయక విగ్రహాలు, ప్రజలతో కిక్కిరిసిపోయాయి. హుస్సేన్ సాగర్ పరిసరాలు జనసంద్రాన్ని తలపించాయి.

ఎప్పుడూ లేనిది ఈసారి గణేశ్ నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో పిల్లలతో సహా వచ్చి... వేడుకల్లో పాల్గొన్నారు. ఐతే... ఇప్పటికీ 500 విగ్రహాలు ఇంకా నిమజ్జనానికి రావాల్సి ఉంది. భారీ వాహనాలపై విగ్రహాలు వస్తుండటంతో... హైదరాబాద్‌లోని చాలా ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. వీలైనంత త్వరగా నిమజ్జన ప్రక్రియ పూర్తి చెయ్యాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. సాయంత్రానికి ఇది పూర్తయ్యేలా ఉంది.

జోరుగా వ్యర్థాల తరలింపు : ఓవైపు విగ్రహాల్ని నిమజ్జనం చేస్తుంటే... మరోవైపు చెరువులు, హుస్సేన్ సాగర్‌లో వ్యర్థాల తొలగింపు జోరుగా సాగుతోంది. నిన్న రాత్రి నుంచే వ్యర్థాల్ని తొలగించే ప్రక్రియ ప్రారంభించారు. ఐతే... ఈసారి హుస్సేన్ సాగర్‌లో ఎక్కువ నీరు ఉండటంతో... లోపల ఎన్ని విగ్రహాలు ఉన్నాయో తెలియట్లేదు. చిన్నా పెద్ద అన్నింటినీ తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇనుము వ్యర్థాల్ని పట్టుకుపోయేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇలా హుస్సేన్ సాగర్ పరిసరాలు ఇవాళ కూడా హడావుడిగానే ఉన్నాయి.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు