హోమ్ /వార్తలు /తెలంగాణ /

Vinayaka Chavithi 2020: ఈ జిల్లాలో గణేష్ ఉత్సవాలు రద్దు.. గ్రామానికో గణేష్ నినాదం..

Vinayaka Chavithi 2020: ఈ జిల్లాలో గణేష్ ఉత్సవాలు రద్దు.. గ్రామానికో గణేష్ నినాదం..

గణేష్ ప్రతిమలు

గణేష్ ప్రతిమలు

Ganesh Chaturthi 2020: వినాయక ఉత్స‌వాల‌కు కరోనా సెగ తగిలింది. ప్రతి యేడు గణేష్ ఉత్సవాలు వీధి, పల్లె, ప‌ట్ట‌ణం అనే తేడాలేకుండా ఘనంగా జరిగేవి.

  (పి.మ‌హేంద‌ర్, న్యూస్18తెలుగు, ప్ర‌తినిధి)

  Vinayaka Chavithi 2020: వినాయక ఉత్స‌వాల‌కు కరోనా సెగ తగిలింది. ప్రతి యేడు గణేష్ ఉత్సవాలు వీధి, పల్లె, ప‌ట్ట‌ణం అనే తేడాలేకుండా ఘనంగా జరిగేవి. కానీ ఈ యేడు క‌రోనా మహమ్మారి కారణంగా గణేష్ ఉత్సవాలకు బ్రేకులు ప‌డ్డాయి. దీంతో ‘గ్రామానికి ఒక గణపతి ముద్దు - కరోనా వద్దు’ అనే నినాదం వినిపిస్తుంది. ఈ దిశ‌గా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. ప్రతి యేడు జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసి, గ‌ణ‌నాధునికి ప్ర‌త్యేక‌ పూజలు చేసేవారు. నవ‌రాత్రులు ఘ‌నంగా వినాయ‌కున్ని కొలిచేవారు. న‌గ‌రం, ప‌ల్లె, ప‌ట్ట‌ణం అనే తేడా లేకుండా వీధికో గ‌ణేష్ విగ్ర‌హ‌న్ని ప్ర‌తిష్టించి పూజించేవారు. గ్రామంలో అయితే యూత్ స‌భ్యులు, కుల సంఘాలు వేరు వేరుగా గ‌ణేష్ ఉత్స‌వాలు నిర్వ‌హించేవారు. కానీ ఈ సంవ‌త్స‌రం కరోనా మహమ్మారి కారణంగా గణేష్ ఉత్సవాలను ద‌ర్ప‌ల్లి మండలం, దుబ్బాక గ్రామంలో పూర్తిగా ర‌ద్దు చేసుకున్నారు.. ఎవ‌రి ఇంటిలో వారే గ‌ణేష్ ఉత్స‌వాలు చేసుకోవాల‌ని గ్రామ‌క‌మిటి ప్ర‌క‌టించింది.

  గణేష్ విగ్రహం

  మోపాల్ మండ‌లం, మోపాల్ గ్రామంలో ఒక గణేష్ ముద్దు - కరోనా వద్దు అనే నినాదంతో గ్రామస్తులు ముందుకు వెళ్తున్నారు. కరోనా మహమ్మారి జ‌న‌ సమూహం ఎక్కువ ఉన్న దగ్గర విస్తరిస్తుందనే ఉద్దేశ్యంతో అధికారుల సూచనల మేరకు వినాయ‌క మండ‌పాల‌ను త‌గ్గిస్తున్నాని గ్రామ‌స్తులు తెలిపారు. ఈ యేడు క‌రోనా మ‌హ‌మ్మ‌ారి త‌గ్గిపోతే వ‌చ్చే యేడు గ‌ణేష్ ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకుంటామ‌ని గ్రామ‌స్తులు చెబుతున్నారు.

  గణేష్ విగ్రహానికి మెరుగులు దిద్దుతున్న యువకుడు

  మోపాల్ మండ‌లం ప‌రిధిలోని అన్ని గ్రామాల వారు ఆలోచించి గ్రామానికి ఒక గ‌ణ‌ప‌త మాత్ర‌మే ఏర్పాటు చేసుకోవాని వారు కోరారు. దీంతో గ్రామాల్లో వినాయ‌క చ‌వితి ఏర్పాటు లేక పోవ‌డంతో వీధుల‌న్ని బోసిపోనున్నాయి. అటు గణపతి విగ్రహాలు తయారు చేసి జీవనం సాగించే వారికి ఈ సంవత్సరం చుక్కెదురైంది. ఇప్పటి వరకు బుకింగ్ లు లేక‌ వారు ఆవేదన చెందుతున్నారు. ప్రతి యేటా వందల సంఖ్యలో గ‌ణేష్ ల‌ను తయారు చేసే వారు. కానీ ఈ ఏడు 50శాతం వినాయక విగ్రహాలను తయారు చేస్తే కూడా వాటికి బుకింగ్స్ లేవని అంటున్నారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Ganesh Chaturthi 2020, Nizamabad, Telangana, Vinayaka Chavithi 2020

  ఉత్తమ కథలు