హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ganesh chaturthi: విత్తన వినాయకుడు.. మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో విగ్రహాల పంపిణీ

Ganesh chaturthi: విత్తన వినాయకుడు.. మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో విగ్రహాల పంపిణీ

మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో విగ్రహాల పంపిణీ

మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో విగ్రహాల పంపిణీ

'గివ్‌ బర్త్‌ టు ఎ న్యూ లైఫ్‌ అండ్‌ ప్రాస్పరిటీ' అంటూ ఇంగ్లీషులోనూ.. 'ఆకు పచ్చని ఆవరణం కోసం.. పసిడి పచ్చని మన రాష్ట్రం కోసం' అంటూ తెలుగులో నినాదాల్ని ఆ బ్యాగులపై ముద్రించారు.

  (జి. శ్రీనివాస రెడ్డి, న్యూస్ 18 ఖమ్మం ప్రతినిధి)

  మట్టి నుంచి మట్టి దాకా.. ప్రకృతితో మమేకమవుతూ జీవించడమే మనిషి బతుకు పరమార్థం. వినాయక చవితి అన్నా.. గణేష్‌ నవరాత్రులు అని పిలుచుకున్నా.. ఏ పేరు పెట్టుకున్నా మనిషిని ప్రకృతికి దగ్గర చేయడమే మూల సూత్రం. అందుకే అనాదిగా వినాయకచవితి వచ్చిందంటే చాలు చెరువుమట్టి సేకరించి మనకు తోచినరీతిలో ఆకృతిని తయారు చేసుకుని.. రకరకాల ఫలపత్రపుష్పాలతో పూజించి ఆనక మళ్లీ ఆ చెరువులోనే నిమజ్జనం చేయడం రివాజు.. ఇది ప్రకృతి నుంచి తీసుకుని మళ్లీ ప్రకృతిలోనే కలపడం.. అంటే సైక్లింగ్‌.. దీన్ని మరిచిన మనం మధ్యలో రకరకాల ప్రయోగాలు చేశాం. కృత్రిమ పదార్ధాలైన ప్లాస్టర్‌ పారిస్‌ లాంటి వాటితో గణేషుణ్ని రకరకాల ఆకృతుల్లో రూపొందించాం. వాటినే చెరువులు, నదులు, బావుల్లో నిమజ్జనం పేరిట పడేశాం. ఫలితంగా ఎక్కడ చూసినా కాలుష్యం కనిపిస్తోంది.

  ఐతై కొన్నేళ్లుగా మట్టి వినాయకుణ్నే ప్రతిష్టించాలంటూ అటు ప్రభుత్వం, మీడియా ఇటు పలు స్వచ్ఛంద సంస్థల విస్త్రుతప్రచారం ఫలితంగా జనంలో మార్పు వస్తోంది. ఫలితమే నేడు 'సీడ్‌ గణేషుడు'.. అంటే విత్తన వినాయకుడు. మనిషికి నిత్య జీవితంలో ఎలాంటి చెట్లు ఉంటే మేలు జరుగుతుందో ఆ విత్తనాలను వినాయకుని మట్టి ప్రతిమలో నిక్షిప్తం చేసి.. ఆ విగ్రహాన్నే పూజించి.. నీటిలో నిమజ్జనం బదులుగా మనకు కావాల్సిన చోట నాటుకోవడం. ఇది ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా ఇచ్చిన ఛాలెంజ్‌కు ఎందరో సెలబ్రిటీలు స్పందించారు. వారిలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కూడా ఉన్నారు. ఈ గణేష్‌ నవరాత్రులకు మంత్రి అజయ్‌కుమార్‌ ఖమ్మం పట్టణంలో రెండు వేల విత్తన గణపతి విగ్రహాలను ప్రత్యేకంగా ఆర్గర్‌పై తయారు చేయించారు.

  ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌ల ఫొటోలతో పాటుగా మంత్రి అజయ్‌కుమార్‌ ఫొటోలతో ఒక ఆకర్షణీయమైన బ్యాగ్‌లో విత్తన గణేషుడి విగ్రహాన్ని ప్యాక్‌ చేసి పంపిణీ చేస్తున్నారు. 'గివ్‌ బర్త్‌ టు ఎ న్యూ లైఫ్‌ అండ్‌ ప్రాస్పరిటీ' అంటూ ఇంగ్లీషులోనూ.. 'ఆకు పచ్చని ఆవరణం కోసం.. పసిడి పచ్చని మన రాష్ట్రం కోసం' అంటూ తెలుగులో నినాదాల్ని ఆ బ్యాగులపై ముద్రించారు. ఒక పీచు పదార్ధంలో విగ్రహాన్ని ఉంచారు. దాన్ని యధావిధిగా పూజించి అనంతరం ఆ విగ్రహాన్ని ఎలా నిమజ్జనం రూపంలో విత్తనాలను నాటుకోవాలన్న దాన్ని కూడా స్టెప్స్‌గా ఒక పద్దతి ప్రకారం చిత్రాల రూపంలో ముద్రించారు. వీటిని ఒక్కో కార్పోరేటర్‌కు 40 చొప్పున ఖమ్మం కార్పోరేషన్‌ పరిధిలో మంత్రి అజయ్‌కుమార్‌ తను సొంతంగా మొత్తం రెండు వేల విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలను పూజకు ఉపయోగిస్తూ.. అనంతరం ప్రకృతిని కాపాడుకోడానికి ఎంపీ సంతోష్‌కుమార్‌ పిలుపు మేరకు విత్తణ గణపతిని ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి అజయ్‌కుమర్‌ పేర్కొన్నారు. పర్యావరణ హితమైన ఈ కార్యక్రమంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తన ట్విట్టర్ ఛాలెంజ్ కు స్పందించిన మంత్రి అజయ్ కుమార్ తీరుకు సంతోష కుమార్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Ganesh Chaturthi 2020, Puvvada Ajay, Telangana

  ఉత్తమ కథలు