Home /News /telangana /

GANDRA SATYANARAYANA RAO JOINED IN CONGRESS IN PRESENCE OF REVANTH REDDY VRY

Revanth reddy : మొదటి జండా ఎగిరేది భూపాలపల్లిలోనే.. సోనియా రుణం తీర్చుకునే సమయం వచ్చింది..

Revanth reddy

Revanth reddy

Revanth reddy : రాష్ట్రంలో కాంగ్రెస్ మొదటి జండా ఎగిరే నియోజకవర్గం భూపాల పల్లినే అంటూ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేడు భూపాలపల్లిలో గండ్ర సత్యనారణ చేరిన సంధర్బంగా మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు.

ఇంకా చదవండి ...
    టీపీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy) మిత్రుడు, మాజీ టీడీపీ నేత భూపాలపల్లిలో (Bhupalapally) ఇటివల టీఆర్ఎస్‌లో చేరిన గండ్ర సత్యనారయణ నేడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రేస్‌లో చేరారు. ఈ సంధర్భంగా భారీ బహిరంగ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌తో (cm kcr) పాటు కేటీఆర్‌లు తనను మోసం చేశారని గండ్ర సత్యనారయణ (gandra satyanarayana rao )తీవ్రంగా మండి పడ్డారు.

    మరోవైపు బహిరంగ సభకు ముఖ్య అతిధిగా హజరైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమంలో నక్సలైట్ ఎజెండాను అమలు పరుస్తామన్న సీఎం కేసీఆర్ మాట మార్చారని దుయ్యబట్టారు. నక్సలైట్ ఎజెండా అంటే ఒకే నలుగురి పదవులు కట్టబెట్టడమేనా అని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల పేరు మీద దోచుకోవడం నక్సలైట్ల ఏజెండానా అంటూ ధ్వజమెత్తారు. 1200 మంది విద్యార్థులు అసువులు బాసింది కేసీఆర్ కుటుంభం కోసమేనా అంటూ ఫైర్ అయ్యారు.

    ఇది చదవండి : బీజేపీలోకి తీన్మార్ మల్లన్న.. విడుదల చేయించాలని అమిత్ షాకు లేఖ


    ఇక ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి (sonia gandi) తెలంగాణ ప్రజలు రుణపడి ఉండాలనా ఈయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చి నష్టపోయిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు తలుపులు మూసి, లైవ్ లు కట్ చేసి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ గౌరవం దక్కాలని అన్నారు.

    మరోవైపు కాంగ్రెస్ పార్టీ గెలిపించిన గండ్ర వెంకటరమణా రెడ్డి (gandra venkataramana reddy )కార్యకర్తల గుండెల మీద తన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ కాళ్లమీద పడ్డాడని ధ్వజమెత్తారు. గండ్ర వెంకటరమణారెడ్డికి ఇక రానున్న ఎన్నికలతో రాజకీయ సన్యాసం తీసుకోవడం ఖాయమని హెచ్చారించారు. ఎమ్మెల్యే గండ్ర ఇసుక దందాల నుండి పెట్రోల్ దందాల వరకు అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ మొదటి జెండా ఎగురతుందని అన్నారు.

    ఇది చదవండి : సినీ నిర్మాత భూ కబ్జా చేశాడంటూ రైతులు ఆందోళన.. !


    ఇక కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసు (police) కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసుల డైరీ రాస్తామని,..వారిని ఖచ్చితంగా గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. టీఆర్ఎస్(trs) పార్టీకి కొమ్ము కాస్తున్న పోలీసులపై ఉక్కు పాదం మోపడం ఖాయమని ఆయన అన్నారు. కార్యకర్తలను వేధిస్తున్న అధికారులకు తిరగి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.

    మీ నగరం నుండి (​వరంగల్)

    తెలంగాణ
    ​వరంగల్
    తెలంగాణ
    ​వరంగల్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Revanth reddy, TS Congress

    తదుపరి వార్తలు