గాంధీ వేషధారణలో 5,149 చిన్నారులు..గిన్నిస్ రికార్డే లక్ష్యం

వివిధ పాఠశాలలకు చెందిన 5,149 మంది విద్యార్థులు గాంధీ వేషధారణతో ఆకట్టుకున్నారు. పంచెకట్టు, కళ్లజోడు, చేతికర్రతో బాల గాంధీలు అలరించారు. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా..మహాత్ముడిని ఘన నివాళి అర్పించారు.

news18-telugu
Updated: October 2, 2018, 4:42 PM IST
గాంధీ వేషధారణలో 5,149 చిన్నారులు..గిన్నిస్ రికార్డే లక్ష్యం
గాంధీ వేషధారణలో చిన్నారులు
  • Share this:
దేశవ్యాప్తంగా గాంధీజీ 150 జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.  నల్గొండలో గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్ఠాన్‌, గ్లోబల్‌ ఫ్యామిలీ ఆధ్వర్యంలో మహాత్ముడి పుట్టినరోజును అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన 5,149 మంది విద్యార్థులు గాంధీ వేషధారణతో ఆకట్టుకున్నారు. పంచెకట్టు, కళ్లజోడు, చేతికర్రతో బాల గాంధీలు అలరించారు. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా..మహాత్ముడిని ఘన నివాళి అర్పించారు. నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. గాంధీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయాలనే ఆకాంక్షతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

నల్లొండ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగాలనే ఉద్దేశంతో గిన్నిస్ రికార్డుకు ప్రయత్నించాం. 75 స్కూళ్లకు చెందిన 5,149 మంది విద్యార్థులు గాంధీ వేషధారణలో కనిపించారు. గాంధీ సిద్ధాంతాలు, ఆలోచనలు నేటి తరానికి తెలియాలి. విదేశాల్లో గాంధీ పడిన అవమానాల నుంచే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. శాంతి, అహింసా మార్గాల్లో వెళ్తే ప్రతి ఒక్కరు ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు.
నిర్వాహకులు


గతంలో బెంగళూరులో 4,650 మంది విద్యార్థులు గాంధీ రూపంలో వేషం వేసి గిన్నిస్ రికార్డు సాధించారు. ఇప్పుడా రికార్డు బద్దలు కాబోతోంది.
Published by: Shiva Kumar Addula
First published: October 2, 2018, 4:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading