Home /News /telangana /

GANDHI HOSPITAL RAPE UPDATE POLICE KEEN INQUIRY IS GOING ON VRY

Gandi hospital rape : గాంధీలో 209 సీసీ కెమెరాలు...రేప్ జరిగే అవకాశం లేదంటున్న సూపరిండెంట్..

గాంధీ అసుపత్రి

గాంధీ అసుపత్రి

Gandi hospital rape : గాంధీలో ఏం జరుగుతోంది..మొత్తం రెండు వందలకు పైగా కెమెరాలు ఉన్నా మహిళలపై అత్యాచారం జరిగేందుకు అవకాశం ఉందా.... మరి వారిపై ఎవరు అత్యాచారం చేశారు..గాంధీ సూపరిండెంట్ మాటల వెనక ఆంతర్యం ఏమిటి..

    గాంధీ ఆసుపత్రిలో అత్యాచారం జరిగేందుకు అవకాశం లేదని గాంధీ సూపరిండెంట్ రాజారావు చెబుతున్న మాటలు. మొత్తం గాంధీ ఆసుపత్రిలో 209 సీసీ కెమేరాలు ఉండగా అందులో రెండు 189 పనిచేస్తున్నాయనేది ఆయన వాదన. దీంతో ఆస్పత్రి ఆవరణలో అత్యాచారం జరిగేందుకు అవకాశం లేదనేది ఆయన వాదన. ఇది ప్రాధమిక విచారణలో కూడా తేలిందని ఆయన చెబుతున్నారు. అయినా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అత్యాచార అరోపణలు ఎదుర్కొంటున్న ఉమామహేశ్వర్ రావును సస్పెండ్ చేశామని ఆయన చెబుతున్నారు.

    మరోవైపు బాధితురాలి సోదరి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.రాజారావు చెప్పిన దాని ప్రకారం అన్ని కెమెరాలు ఉంటే ఆమె ఎక్కడికి వెళ్లిందో చెప్పలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. బాధితురాలితోపాటు కనిపించకుండా పోయిన మహిళకు కూడా కల్లు తాగే అలవాటు ఉండడంతో కల్లు కాంపౌండ్‌ల వద్ద కూడా సీసీ కెమెరాలను శోధిస్తున్నారు. కాగా ఆమె బయటకు వెళ్లిన దృశ్యాలను పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది.

    మరోవైపు అదుపులోకి తీసుకున్న వారి విచారణ జరుగుతుండగా..వారి నుండి ఎలాంటీ సమాచారం రాలేదని తెలుస్తోంది. ఉమమహేశ్వర్ రావు బాధితులను సెక్యూరిటి గార్డులకు మాత్రమే పరిచయం చేశానని అదికూడా లోపలికి వెళ్లేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో చేసినట్టుగా చెబుతున్నారు. దీంతో అసలు అత్యాచారం జరిగిందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. భాదితురాలు తనపై అత్యాచారంతో పాటు మత్తు మందు ఇచ్చారని చెబుతున్నా అందుకు సంబంధించి మెడికల్ రిపోర్ట్‌లో మాత్రం బయటపడలేదని తెలుస్తోంది. మరి అలాంటప్పుడు ఎవరు ఎప్పుడు అత్యాచారం చేశారు. ఆమె చెత్త కుప్పల్లో ఎందుకు ఉండాల్సిందనే ప్రశ్నలతో పాటు బాధిత మహిళ సోదరి ఆచూకి కూడా లభించకపోవడం వెనక ఏ కారణాలు ఉంటాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    ఏది ఏమైనా ఈ సంఘటన పోలీసులకు సవాల్‌గా నే మారింది.ఓ వైపు హోంమంత్రి స్వయంగా ఆసుపత్రి విజిట్ చేయడంతో పాటు ఎస్సీ కమిషన్ కూడా దర్యాప్తుపై దృష్టి సారించడంతో ఈ సంఘటన హాట్ టాపిక్‌గా మారింది. మొత్తం మీద కేసును చేధించేందుకు మరో రెండు మూడు రోజుల పట్టే అవకాశాలు ఉన్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Gandhi hospital, Rape case

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు